ఎక్స్‌ట్రా జబర్దస్త్, జబర్దస్త్ లకు ప్రేక్షకుల నుంచి ఎంత మంచి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో జోడీల వ్యవహారం గురంచి మొదటి నుంచి వింటూనే ఉన్నాం. జోడీలుగా చూపిస్తూ.. వారి మధ్య కెమెస్ట్రీని పండించడంలో ఈ షో లు పాపులర్ అయ్యాయి. అందులో మొదట చెప్పుకునే జంటల్లో రష్మీ- సుధీర్. తర్వాత వర్ష- ఇమ్మానుయేల్ జోడీ ఉంటుంది. వర్ష – ఇమ్మానుయెల్ జంటపై ఇప్పటకే అనేక స్కిట్లలో సెటైర్లు వేసారు. జబర్దస్త్ లో వీరి స్కిట్లకు విపరీతమైన క్రేజ్ వుంది. తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమోలో జరిగిన ఒక ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది.
అసలు విషయానికి వస్తే.. జబర్దస్త్ స్టేజిమీద అనేక స్కిట్లు చేస్తుంటారు. ఒక్కోసారి స్కిట్ లో భాగంగా ఎదుటివారిని కొట్టాల్సివస్తుంది. అది యాక్టింగే అయినా అనుకోకుండా ఒక్కోసారి స్కిట్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే కొట్టేస్తుంటారు. వర్ష – ఇమ్మాన్యుయేల్ విషయంలో కూడా అచ్చంగా ఇలానే జరిగింది. ఆ ప్రోమో ప్రకారం ఇమ్మాన్యుయేల్ వర్షని ఇలానే కొట్టేసాడు. ఎం జరుగుతుంది అక్కడ.. పడుకున్న వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని వర్ష డైలాగ్ చెప్పగానే స్కిట్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయిన ఇమ్మాన్యుయేల్ వర్ష జుట్టు పట్టుకుని ఒక్కసారిగా లాగేస్తాడు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో వర్ష బిత్తరపోయి చూస్తుంది. ఆ సమయంలో బులెట్ భాస్కర్ వర్ష ని లేపుతాడు. అయితే స్కిట్ లో భాగంగా ఇలాంటివి కామన్ గా జరుగుతాయని కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ విడియో చూసి మీ అభిప్రాయాలు చెప్పండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…