జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత నటిగా కూడా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా ఒక వైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో అద్భుతమైన పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు అనసూయ. ఈ నేపద్యంలో పలు అంశాలపై ఎప్పుడూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూనే ఉంటారు. అనేక సార్లు ఆమె చేసిన ట్వీట్స్ వివాదాస్పదం అయ్యాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ పై మరోసారి వివాదం చేలరెంగింది.
అసలు విషయం ఏమిటంటే.. మహిళా దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది అనసూయ. అయితే సింపుల్ గా చేస్తే తన స్పెషాలిటీ ఏముంటుంది అనుకుందో ఏమో.. కాస్త వెటకారం జోడింజి “అదేంటి సడన్ గా ఈరోజు ట్రోలర్స్, మీమర్స్ అందరూ మహిళలను గౌరవించడం మొదలుపెట్టారు. అయినా 24 గంటలలో అంతరించిపోతుందని తెలుసు కాబట్టి అందరికీ హ్యాపీ ఫూల్స్ డే” అంటూ ట్వీట్ చేసింది.
ఇలా వెటకారంగా ట్వీట్ చేయడంతో నేటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు. ఆమెపై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. “మదర్ థెరిసా, కల్పనా చావ్లా, మేరికోం, కిరణ్ బెడి, యాంకర్ సుమ వంటి వాళ్ళను ఎవరూ ట్రోల్ చేయరు. ఎందుకంటే.. మగవాళ్ళు ఆడవారి బిహేవియర్ ను గౌరవిస్తారు. కానీ నీలాంటి వాళ్ళను కాదు” అంటూ ఒక రేంజ్ లో మండిపడుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…