Featured

Manchu Lakshmi : అంత బ్యాగ్రౌండ్ ఉన్న నన్నే ఇబ్బంది పెట్టారు.. క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి !

మూడు సంవ‌త్స‌రాలుగా కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. సౌత్ టు నార్త్ అన్ని సినిమా ఇండ‌స్ట్రీల్లోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఓ జాడ్యం మాదిరిగా మారిపోయింది. 2018 లో మీటూ అంటూ ఈ ఉద్యమం దేశం మొత్తం షికార్లు కొట్టింది. ఇప్ప‌టికే చాలా మంది హీరోయిన్లు ధైర్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రీ కాస్టింగ్ కౌచ్ గురించి చెపుతున్నారు. ఎవరు తమను ఇబ్బంది పెట్టారో చెబుతున్నారు. టాలీవుడ్ లో కూడా కొంతమంది నటీమణులు బయటకు వచ్చి చెప్పినప్పటికీ .. ప్రత్యేకంగా వాళ్లు ఎవరు అనేది బయట పెట్టలేదు. ఇదే విషయమై నటి శ్రీ రెడ్డి పెద్ద యుద్దమే చేసిన విషయం తెలిసిందే.

ఆ ఘటన తర్వాతే చాలామంది హీరోయిన్లు బయటకు వచ్చి తాము కూడా కాస్టింగ్ కౌచ్ కు గురైనట్లు చెప్పారు. ఈ విషయంలో కొంతమంది లొంగిపోవడంతో వేధింపులు ఎదురు కాలేదు అంటూ సెటైర్లు కూడా వేశారు. ఇదంతా ఇలా ఉంటే.. బ్యాగ్రౌండ్ లేనివారికి ఇలాంటి వేధింపులు ఎదురవుతాయి అనుకోవడం పొరపాటు.. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో మంచి బ్యాగ్రౌండ్ ఉన్న నాకు కూడా ఇలాంటి వేదింపులు ఎదురయ్యాయని చెబుతున్నారు మంచు లక్ష్మి.

తాజగా మహిళా దినోత్సవం సందర్బంగా నేషనల్ మీడియాలో ముచ్చటించిన మంచు లక్ష్మి క్యాస్టింగ్ కౌచ్ గురించి మొదట్లో తానూ ఎదుర్కొన్న అనుభవాలు గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగాను అందువల్ల క్యాస్టింగ్ కౌచ్ తనకు ఎందుకు ఎదురవుతుంది అని మొదట్లో అనుకున్నాను. అయినా కూడా తనకు అటువంటి అనుభవాలే ఎదురయ్యాయని మంచు లక్ష్మి తెలిపారు. ఈ సమస్య కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఇలాంటివి ఎదురవుతున్నాయని తెలిపారు. తన స్నేహితులు కూడా పలు రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురైనట్టు ఈ సంధర్భంగా ఆమె తెలిపారు.

ఇక ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్, బాడీ షేమింగ్ వంటివి అయితే సినెమా బ్యాగ్రౌండ్ ఉన్న తమలాంటి వారికి చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రతి విషయాన్ని ట్రోల్ చేస్తూనే ఉంటారని అటువంటి వాటిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. అందుకే అవేమి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago