మూడు సంవత్సరాలుగా కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. సౌత్ టు నార్త్ అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఓ జాడ్యం మాదిరిగా మారిపోయింది. 2018 లో మీటూ అంటూ ఈ ఉద్యమం దేశం మొత్తం షికార్లు కొట్టింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ధైర్యంగా బయటకు వచ్చి మరీ కాస్టింగ్ కౌచ్ గురించి చెపుతున్నారు. ఎవరు తమను ఇబ్బంది పెట్టారో చెబుతున్నారు. టాలీవుడ్ లో కూడా కొంతమంది నటీమణులు బయటకు వచ్చి చెప్పినప్పటికీ .. ప్రత్యేకంగా వాళ్లు ఎవరు అనేది బయట పెట్టలేదు. ఇదే విషయమై నటి శ్రీ రెడ్డి పెద్ద యుద్దమే చేసిన విషయం తెలిసిందే.

ఆ ఘటన తర్వాతే చాలామంది హీరోయిన్లు బయటకు వచ్చి తాము కూడా కాస్టింగ్ కౌచ్ కు గురైనట్లు చెప్పారు. ఈ విషయంలో కొంతమంది లొంగిపోవడంతో వేధింపులు ఎదురు కాలేదు అంటూ సెటైర్లు కూడా వేశారు. ఇదంతా ఇలా ఉంటే.. బ్యాగ్రౌండ్ లేనివారికి ఇలాంటి వేధింపులు ఎదురవుతాయి అనుకోవడం పొరపాటు.. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో మంచి బ్యాగ్రౌండ్ ఉన్న నాకు కూడా ఇలాంటి వేదింపులు ఎదురయ్యాయని చెబుతున్నారు మంచు లక్ష్మి.

తాజగా మహిళా దినోత్సవం సందర్బంగా నేషనల్ మీడియాలో ముచ్చటించిన మంచు లక్ష్మి క్యాస్టింగ్ కౌచ్ గురించి మొదట్లో తానూ ఎదుర్కొన్న అనుభవాలు గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగాను అందువల్ల క్యాస్టింగ్ కౌచ్ తనకు ఎందుకు ఎదురవుతుంది అని మొదట్లో అనుకున్నాను. అయినా కూడా తనకు అటువంటి అనుభవాలే ఎదురయ్యాయని మంచు లక్ష్మి తెలిపారు. ఈ సమస్య కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఇలాంటివి ఎదురవుతున్నాయని తెలిపారు. తన స్నేహితులు కూడా పలు రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురైనట్టు ఈ సంధర్భంగా ఆమె తెలిపారు.

ఇక ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్, బాడీ షేమింగ్ వంటివి అయితే సినెమా బ్యాగ్రౌండ్ ఉన్న తమలాంటి వారికి చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రతి విషయాన్ని ట్రోల్ చేస్తూనే ఉంటారని అటువంటి వాటిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. అందుకే అవేమి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు..

































