Featured

Adi Reddy: ఆ షోలతో పోలిస్తే బిగ్ బాస్ లో ఎలాంటి వల్గారిటీ లేదు… బిగ్ బాస్ ఆదిరెడ్డి షాకింగ్ కామెంట్స్!

Adi Reddy: బిగ్ బాస్ రివ్యూయర్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆదిరెడ్డి సీజన్ సిక్స్ కార్యక్రమంలో ఏకంగా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన టాప్ త్రీ కంటెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా ఒక సామాన్య వ్యక్తి బిగ్ బాస్ కార్యక్రమంలో ఫైనల్ వరకు కొనసాగడం బిగ్ బాస్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సీజన్ సెవెన్ త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆపివేయాలి అంటూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ఆదిరెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రతి సీజన్ ముందు ఈ కార్యక్రమం ప్రసారానికి ఇలా హైకోర్టు నుంచి ఉత్తర్వులు వస్తూనే ఉంటాయి. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని తాను అభిప్రాయపడ్డారు అంతేకాకుండా సినిమాలలోను ఎన్నో వెబ్ సిరీస్ లలో , కొన్ని కామెడీ షో లలో ఉన్నంత వల్గారిటీ ఈ బిగ్ బాస్ కార్యక్రమంలో లేదని ఈయన తెలిపారు.

Adi Reddy: ఇష్టముంటే చూస్తారు లేదంటే లేదు…


ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఆదిరెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ కామెంట్ చేశారు. ఇక ఈ కార్యక్రమాన్ని ఇష్టం ఉన్నవాళ్లు చూస్తారు లేని వాళ్ళు చూడకుండా ఉంటారు అంటూ తన అభిప్రాయాన్ని తెలపడేమేకాకుండా మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆది రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago