రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చౌడేశ్వర నగర్ ప్రాంతంలో పంపిణీ చేసిన పాలు తాగిన తర్వాత పలువురు అనారోగ్యానికి గురికావడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో ఇద్దరు వృద్ధ మహిళలు చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో 13 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మృతులు కృష్ణవేణి (85), కనకరత్నం (70)గా గుర్తించారు. బాధితులందరికీ మూత్రం ఆగిపోవడం వంటి లక్షణాలు కనిపించడంతో వైద్యులు కిడ్నీ సంబంధిత సమస్యగా అనుమానిస్తున్నారు. అనూరియా లక్షణాలతో బాధపడుతున్న పలువురికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, పాలు సరఫరా చేసిన వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పద పాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనకు నిజంగా కల్తీ పాలు కారణమా? లేక అపార్ట్‌మెంట్ నీటి ట్యాంకుల పరిశుభ్రత లోపం వల్ల ఇన్ఫెక్షన్ సోకిందా? అనే అంశాలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయి ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాతే అసలు కారణం వెలుగులోకి రానుంది.
ఈ ఘటనతో ప్రాంతీయ ప్రజల్లో భయం నెలకొంది. పాల నాణ్యతపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఓటీటీ వేదికపై కొత్తగా స్ట్రీమింగ్ అవుతున్న సరస్వతి సినిమా, కథా నేపథ్యం వల్ల ప్రారంభంలోనే ఆసక్తిని కలిగించినా, ఆ ఆసక్తిని…
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదం చివరకు హత్యకు దారితీసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం…
యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన రాకాస సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. విడుదలైన…
తమిళ బుల్లితెర రంగంలో గుర్తింపు పొందిన నటి సుభాషిణి మృతి వార్త సినీ, టీవీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.…
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడికు నిర్మాత దిల్ రాజు నుంచి ఆసక్తికర ఆఫర్ రావడం ఇండస్ట్రీలో…
టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నటి జాన్వీ కపూర్ తన టీనేజ్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా…