Shanmukh Jashwanth: దీప్తితో బ్రేకప్ తర్వాత..! యూట్యూబ్ స్టార్ తో గృహప్రవేశం చేసిన షణ్ముఖ్ జశ్వంత్..?
Shanmukh Jashwanth: షణ్ముఖ్ జశ్వంత్ ఈ పేరు తెలియని సగటు తెలుగు ప్రేక్షకుడు ఉండరేమో. అంతలా అభిమానులను సంపాదించుకున్నాడు. యూట్యూబ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ జశ్వంత్ ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 5లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.
టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన షణ్ముక్ అనూహ్యంగా హౌస్ లో సిరితో సాగించిన వ్యవహారంతో రన్నర్ గా నిలిచాడు. ఒక విధంగా చెప్పాలంటే.. సిరితో హగ్గింగ్ లు, కిస్సింగ్ ల కారణంగానే విన్నర్ గా నిలిచిన సన్నీగా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.
అతడి మీద వ్యతిరేకత సన్నీపై పాజిటివ్ గా మారింది. ఇక అతడు బయటకు వచ్చిన తర్వాత ప్రేమికురాలు దీప్తి సునయనా బ్రేకప్ చెప్పేసింది. తన సోషల్ మీడియాలో ఖాతాలో తాను అతడితో ప్రమయానం సాగించడానికి ఇష్టపడట్లేదని చెప్పి షాక్ ఇచ్చింది. దీనికి షణ్ముఖ్ కూడా.. ఆల్ ది బెస్ట్ దీప్తి సునయానా అంటూ సోషల్ మీడియా లో పోస్టు చేసి క్లారిటీ ఇచ్చాడు.
ఇక బిగ్ బాస్ షోలో అతడికి భారీగా రెమ్యూనరేషన్ ముట్టినట్లు సమాచారం. షణ్ముఖ్ తర్వాత యాంకర్ రవికి అంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ కు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. అంతే కాదు.. మరికొన్ని వెబ్ సిరీస్ లకు కూడా సంతకం చేసినట్లు సమాచారం. తాజాగా అతడు బిగ్ బాస్ ద్వారా సంపాదించుకున్న డబ్బులతో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఇటీవల ఆ గృహప్రవేశం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అతడికి చాలామంది సెలెబ్రిటీలో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ గృహప్రవేశ వేడుకకు.. యూట్యూబర్ శ్రీవిద్య తో పాటు.. మరికొంతమంది హాజరయ్యారు. శ్రీవిద్య షణ్ముఖ్ కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. షణ్ముఖ్ శ్రీదివ్యకు అంత ప్రాధాన్యత ఇవ్వడం విశేషత సంతరించుకుంది. దీప్తితో బ్రేకప్ కాకుండా ఉంటే.. శ్రీవిద్య ప్లేస్ లో దీప్తి ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…
శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…
ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…
అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…
బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…