Aishwarya Rai : అందానికి నిర్వచనం మాటల్లో చెప్పకుండా చూపించాలంటే నీలి కళ్ళ సుందరి ఐశ్వర్యరాయ్ ని చూపిస్తే సరిపోతుంది. అందం అనగానే ఎవరికైనా గుర్తొచ్చే రూపం అది. నాలుగు పదుల వయసులో కూడా అందం ఏ మాత్రం తగ్గకుండా ఇప్పటికి కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకోనేలా అందంతో అలరిస్తోంది. ఇక దాదాపు ఇరవై ఏళ్లుగా అంతర్జాతీయ వేదికలపై తళుక్కున మెరుస్తోంది. ఇటీవల కేన్స్ వేదికపై కూడా మెరిసింది. అభిషేక్ బచ్చన్ తో వివాహం తరువాత సినిమాలను తగ్గించి వైవాహిక జీవితానికి పరిమితమైంది.
విశ్వ సుందరి మొదటి జీతం 1500 ….
వివాహం ఆ తరువాత ఆరాధ్య పుట్టాక ఐశ్వర్య సినిమాలు తగ్గించి తల్లిగా తన బాధ్యతలను చూసుకుంది. ఇక మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలలో నటించింది. అయితే సోషల్ మీడియాలో ఇపుడు ఐష్ కే సంబంధించిన ఒక విషయం బాగా వైరల్ అవుతోంది, అదే తన మొదటి జీతం. ఐష్ 1994 లో ప్రపంచ సుందరి కాకముందు మోడలింగ్ వైపు అడుగులేసింది. మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ లో పాల్గొన్న ఐశ్వర్యకి అందిన పారితోషకం అక్షరాలా 1500 రూపాయలు.
శ్రీ కృప క్రియేషన్స్ అనే సంస్థ తన ఫ్యాషన్ క్యాట్ లాగ్ కోసం ఐశ్వర్య తో సల్వార్ కమిజ్ లో ఫోటోషూట్ చేసింది. ఇందుకు గాను 1500 జీతం తీసుకున్నట్లు అగ్రిమెంట్ పై సంతకం చేసింది ఐశ్వర్య. 18 ఏళ్ల వయసులో తాను తీసుకున్న మొదటి జీతం 1500 చెక్ రూపంలో చెల్లించారు ఆ సంస్థలు వారు, కాగా ఇపుడు ఈ అగ్రిమెంట్ తాలూకు ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…