Ajith : మెక్‌లారెన్ లగ్జరీ కారులు మన భారత దేశంలో చాలా తక్కువ సంఖ్యలో వున్నాయి. బాలీవుడ్‌లో ప్రముఖ హీరో కార్తీన్ ఆర్యన్‌కు నిర్మాత భూషన్ కుమార్ మెక్‌లారెన్ జీటీ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు రూ. 3.75కోట్లు ఉంటుంది. అయితే ఈ కారు ఇండియాలోనే మొదటిది అవ్వటం విశేషం. ఇక ఇపుడు తాజాగా తమిళ్ హీరో అజిత్ మెక్‌లారెన్ లగ్జరీ కారులో ఫోటో దిగాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అత్యంత ఖరీదైనా కారులో అజిత్…
తమిళ్ టాప్ హీరోలలో అజిత్ కూడా ఒకరు. రియల్ లైఫ్ లో సింపుల్ గా కనిపించే అజిత్ కీ కార్లు బైకులు అంటే మక్కువ ఎక్కువ. నిజ జీవితంలో అజిత్ ఒక రేసర్ అవ్వడం విశేషం. తీరిక దొరికినపుడల్లా స్నేహితులతో రేసులలో పాల్గొంటారు. ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచేసి వేకెషన్ కు వెళ్ళాడు. యూకే, యూరప్ టూర్‌లో వున్నారు. వేకెషన్ లో ఉన్న అజిత్ తన ఫ్రెండ్స్‌తో బైక్ రైడ్ చేస్తున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అజిత్ లండన్ ట్రిప్ లో వున్నారు.
ఈ క్రమంలోనే అత్యంత ఖరీదైన మెక్‌లారెన్ లగ్జరీ కార్ల షోరూమును సందర్శించారు. మెక్‌లారెన్ లగ్జరీ కార్లను చూసిన అజిత్ సంతోషంతో ఓ కారులో ఫొటో కూడా దిగారు. అయితే ఆ కారు ధర దాదాపు 5 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కూలింగ్ గ్లాస్‌ల తో అజిత్ ఎంతో స్టైలిష్‌గా ఉన్నారు. అజిత్ కారుతో దిగిన ఫొటోని చూసిన అభిమానులు, నెటిజన్లు… ఆయన మెక్‌లారెన్ కారును కొన్నారంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి, అజిత్ మెక్‌లారెన్ కారును కొనటానికి షోరూంకు వెళ్లారా లేకపోతే కేవలం కార్ల మీద ఉన్న ఇష్టంతో కేవలం చూడటానికి వెళ్లారా అన్నది తెలియాల్సి వుంది. మొత్తానికి ఈ ఫోటోలు నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…