Jaya Prakash Narayan : ఇండియా ప్రజాస్వామిక దేశం, ప్రజలకు నచ్చిన వాళ్ళను ఎంచుకుని పాలనా పగ్గాలను అందిస్తారు. ఇక రాష్ట్రపతిని మాత్రం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా పరోక్షంగా ఎన్నుకుంటాం. అంటే మనం ప్రత్యక్షంగా ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేసి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను ఎన్నుకుంటారు. అంటే మనం పరోక్షంగా మనం రాష్ట్రపతిని నిర్ణయిస్తాము. ఇక రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తికని ఎన్నుకోవటం సంప్రదాయం. అలా రాజకీయాల్లో కాకుండా ఇతర రంగాల్లో ఉన్న వాళ్లను దేశం మొదటి పౌరుడిగా ఎన్నుకోవటం జరుగుతోంది.
వెంకయ్యనాయుడు గారు రాష్ట్రపతి కాకపోవడానికి కారణం అదే…
ఇక మన తెలుగు వ్యక్తి, నెల్లూరుకి చెందిన వెంకయ్యనాయుడు మన దేశానికి ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. ఇక మన దేశంలో చాలాసార్లు ఉపరాష్ట్రపతి ఆ తరువాత కాలంలో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అలా వెంకయ్య గారు కూడా రాష్ట్రపతి అవుతారని అందరూ భావించారు. తెలుగు వారైతే బాగా ఆశపడ్డారు. కానీ ఆ ఆశలు అడియాసలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ద్రౌపది మూర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఇక అధికారంలో ప్రస్తుతం ఉన్న పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ కాబట్టి ద్రౌపది మూర్ము రాష్ట్రపతి అయ్యే అవకాశం ఎక్కువ.
ఇక వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిని చేయకపోడానికి గల కారణాలను జయప్రకాష్ గారు విశ్లేషించారు. మోదీ ఎపుడు బలహీన వర్గాల వారికి ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు ఆయన కూడా బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల అలా ఆలోచిస్తారు. రామ్ నాధ్ కోవింద్ గారిని ఇప్పుడు ద్రౌపది మూర్ము ని అలాగే ఎంపిక చేసారు. ద్రౌపది మూర్ము గిరిజన ఆదివాసి జాతికి చెందిన వ్యక్తి కావడంతో ఆమెకు గుర్తింపునిచ్చారు మోదీ అని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…