తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు వరుస ఫ్లాప్ లను చవిచూసిన పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలను నిర్మిస్తూ దర్శకత్వం బాధ్యతలను చేపడుతున్నారు.
ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి అనిల్ పాధురి దర్శకత్వంలో రొమాంటిక్ అనే చిత్రంలో నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఆకాష్ పూరితో ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
పూరి జగన్నాథ్ కు ఒక కుమారుడు ఒక కుమార్తె అన్న సంగతి మనకు తెలిసిందే. కొడుకు ఆకాష్ పూరి సినిమాలలో నటిస్తూ ఉండగా కూతురు కూడా త్వరలోనే సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. పూరి కూతురు పవిత్రకు సినిమాలంటే ఏమాత్రం ఇష్టం లేదని, కేవలం నాన్న బలవంతం మీదే బుజ్జిగాడు సినిమాలో చిన్నప్పటి త్రిష పాత్రలో నటించనుందని ఈ సందర్భంగా ఆకాష్ తెలియజేశారు.
అయితే తనకు సినిమాల్లో నటించడం కన్నా నిర్మాణరంగంలో పనిచేయడం ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజులలో పవిత్ర పూరి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మాణ బాధ్యతలను చేపడుతుందని ఆకాశ్ ఈ సందర్భంగా పవిత్ర వెండితెర ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…