Alia Bhatt: కరణ్ షోలో ఫస్ట్ నైట్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన అలియా.. అలసిపోయి ఉంటామంటూ కామెంట్స్?
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన ప్రియుడు రణబీర్ కపూర్ తో కలిసి ఏప్రిల్ 14వ తేదీ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఐదు సంవత్సరాలు పాటు ప్రేమ ప్రయాణం కొనసాగించిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.అయితే ఈమె పెళ్లి జరిగి మూడు నెలలకే అలియా శుభవార్త అంటూ తాను గర్భవతి అనే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నెటిజెన్లు, సినీ సెలబ్రిటీలు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదిలా ఉండగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా కరణ్ విత్ కాఫీ అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా ఈయన హీరో హీరోయిన్లను వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి సమాధానాలు రాబడుతూ ఉంటారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ఆరు సీజన్లను పూర్తిచేసుకుని ఈనెల 7వ తేదీ నుంచి ఏడవ సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో ఈ ప్రోమోలో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీలు రణబీర్ కపూర్, అలియా పాల్గొన్నట్టు తెలుస్తుంది.
ఇకపోతే ఈ షోలో భాగంగా కరణ్ జోహార్ అలియా భట్ ను ప్రశ్నిస్తూ ఫస్ట్ డెస్టినేషన్ గురించి అడిగారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ… ఫస్ట్ నైట్ అనేది ఏమీ ఉండదు.. ఆ సమయానికి అలసిపోయి ఉంటాము అంటూ బోల్డ్ సమాధానం చెప్పారు.ఈ విధంగా అలియా ఫస్ట్ నైట్ గురించి చెప్పిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇకపోతే ఈ షోలో భాగంగా రణబీర్ కపూర్ అలియా భట్ కరణ్ అడిగిన ప్రశ్నలకు ఎంతో చలాకీగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో సమంత కూడా పాల్గొనబోతున్నారు. సమంత కూడా విడాకుల గురించి ఈ కార్యక్రమంలో తప్పకుండా బయటపెట్టాల్సి వస్తుందని ఆ సమయంలో సమంత ఎలాంటి సమాధానం చెబుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…