Featured

Naresh : అప్పుడేమో రమ్య చాలా మంచిది.. ఇప్పుడేమో చీటర్… నరేష్ పాత వీడియో నెట్టింట్లో ట్రెండ్..!

Naresh : రమ్య, నరేష్, పవిత్ర లోకేష్ ల వివాదం రోజురోజుకీ బాగా ముదురుతోంది. మీడియా కూడా ఇక వీళ్ళ ఇష్యూ వదిలేద్దామని అనుకున్నా మళ్ళీ ఎవరో ఒకరు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఇష్యూని ఇంకొంచం రసవత్తరం చేస్తున్నారు. ఇక వీళ్ళ విషయంలో బాగా హైలైట్ రమ్య, నరేష్ లు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు. నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ఇక నరేష్ రమ్య తన కారు డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని, కన్నడ టీవీ ఛానల్ ఓనర్ తో ఉంటోందని ఘాటు వాఖ్యలు చేసాడు. ఇదిలా ఉంటే ఒకప్పుడు నరేష్ ఇంటర్వ్యూ లో రమ్య గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

బాల్య వివాహం జరిగింది… రమ్య చాలా మంచిది.. కుటుంబంలో అందరితో కలిసిపోయింది…

ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్ రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో నరేష్ ను ఇంటర్వ్యూ చేసాడు రాధాకృష్ణ. ఇక ఇంటర్వ్యూ లో తన మూడు పెళ్లిళ్ల గురించి చెప్పాడు నరేష్. మొదటి పెళ్లి చాలా చిన్న వయసులో అయిందని ఒకరకంగా అది బాల్యవివాహం అనొచ్చు అంటూ 19 ఏళ్లకే పెళ్లయిందని వివరించాడు. ఇక మొదటి భార్య కుటుంబంతో చాలా చక్కటి అనుబంధం ఉందని వివిధ కారణాలు, ఆరోగ్యసమస్యల వల్ల విడిపోయామని చెప్పాడు. ఇక మూడో భార్య రమ్య గురించి మాట్లాడుతూ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని, ఆధ్యాత్మికత వైపు వెళ్లానని, కానీ ఇంట్లో వాళ్ళు మల్లీ పెళ్లి చేసుకోమన్నారు. ఇక దేవుడు అలా నిర్ణయించాడు అందుకే చేసుకున్నా అని చెప్పాడు.

రమ్య గురించి చెబుతూ.. రమ్య చాలా మంచిది, కుటుంబంలో చక్కగా కలిసి పోతుంది అంటూ చెప్పారు తన వల్ల నేను నా సామాజిక పనులు కూడా చక్కగా చేసుకోగలుగుతున్నానని చెప్పాడు. ఇక ఇపుడు గొడవల తరువాత రమ్య కు డ్రైవర్ తో అక్రమ సంబంధం ఉందని, అలాగే కన్నడ టీవీ ఛానల్ ఓనర్ తో ఉంటోందని, ఎంతోమందిని డబ్బు తీసుకుని మోసం చేస్తే ఆ అవమానాలు, హింస భరించలేక విడాకులు తీసుకోవాలని అనుకున్నట్లు వివరించిన వీడియో రెండూ ప్రస్తుతం అప్పుడు, ఇప్పుడు అంటూ బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago