Featured

Allu Arjun : కమర్షియల్ యాడ్ వల్ల కేసులో ఇరుక్కున్న బన్నీ… తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు..!

Allu Arjun : బన్నీ సినిమాలతో ఎంత సక్సెస్ అయ్యాడో తన కమర్షియల్ యాడ్స్ తో కూడా అంతే పాపులర్. యాడ్స్ లో కూడా తన స్టైలిష్ లుక్ తో బ్రాండు వాల్యూ పెంచుకుంటూ పోతున్నాడు. అలాగే పబ్లిక్ లో ఇమేజ్ కూడా తెచ్చుకుంటున్నాడు.బన్నీ చాలానే వాణిజ్య ప్రకటనలలో కనిపిస్తున్నా లీగల్ గా ఎప్పుడు ఏ సమస్య రాలేదు. ఎందుకంటే బన్నీ ఇంతవరకు చేసిన యాడ్స్ అన్ని ఏవో ఒక సాఫ్ట్ డ్రింక్ లేదా ఏవో ఒక ప్రొడక్ట్స్ కి సంబంధించినవే. అయితే మొన్నామధ్య బన్నీ అందరికి షాక్ ఇస్తూ విద్యాసంస్థలకు ప్రచారకర్తగా మారాడు.

శ్రీ చైతన్య విద్యాసంస్థల యాడ్ చేసిన బన్నీ….

తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్, జేఇఇ వంటి ఫలితాలు వస్తే టీవీ పెట్టాలంటేనే భయమేస్తుంది. ప్రముఖ విద్యాసంస్థలన్ని మాదే మొదటి ర్యాంకు అంటూ ఉదరగోడుతుంటారు. అయితే ఇలాంటి ఒక యాడ్ బన్నీ చేస్తాడని బహుశా తన అభిమానులు కూడా అనుకుని ఉండరు. శ్రీ చైతన్య కాలేజీ తరుపున మొదటి ర్యాంకులు మావే అంటూ యాడ్ చేసాడు బన్నీ. అంతవరకు బాగానే ఉన్నా ఆ యాడ్ లో సమాచారం కరెక్ట్ గా లేకపోవడంతో ఇపుడు చిక్కుల్లో పడ్డాడు.

కొత్త ఉపేంద్ర రెడ్డి అనే వ్యక్తి శ్రీ చైతన్య కాలేజ్ పైనా ప్రచారకర్తగా ఉన్న బన్నీ పైనా జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణపై అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. నిజానికి ప్రచారకర్తగా ఉన్న వ్యక్తి ఆ బ్రాండు గురించి తెలుసుకుని ప్రచారం చేయాలి లేదంటే ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. రియల్ ఎస్టేట్ వెంచర్ కి ప్రచారాలు చేసినప్పుడు ప్రముఖ నటి జెనిలియా పైనా, అమితాబ్ బచ్చన్ పైనా కేసులు పడ్డాయి. ఇపుడు ఈ కేసుపై బన్నీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Bhargavi

Recent Posts

3 పీహెచ్‌డీలు, 46 పీజీలు! 138 డిగ్రీలు సాధించిన మాజీ సైనికుడు..

విద్యపై పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులైనా అడ్డుకావని మరోసారి నిరూపించిన వ్యక్తిగా రాజస్థాన్‌కు చెందిన మాజీ సైనికుడు దశరథ్ సింగ్…

17 minutes ago

2027 పుష్కరాల కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్.. కోట్లాది భక్తుల కోసం స్నాన ఘట్టాల విస్తరణ!

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ మహోత్సవానికి భారీగా భక్తులు…

30 minutes ago

చందనోత్సవం కోసం 70 బస్సులు..అప్పన్న దర్శనానికి ప్రత్యేక ప్లాన్.. భక్తుల కోసం ప్రత్యేక చర్యలు!

సింహాచలం దేవస్థానంలో ఈ నెల 20న జరగనున్న అప్పన్న స్వామి చందనోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే…

50 minutes ago

“తెలుగు కోడలిగా మారిపో”.. మృణాళ్‌కు అరవింద్ సూచన వైరల్

టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన సినిమా వేడుకలో జరిగిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మృణాళ్…

56 minutes ago

గానలెజెండ్ ఆశా భోంస్లే కన్నుమూత.. ఐపీఎల్‌లో నల్ల బ్యాండ్లతో నివాళి

భారత సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు అలరించిన గానలెజెండ్ ఆశా భోంస్లే కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని…

56 minutes ago

ఇంట్లో నెమలి ఈకలు పెడుతున్నారా? అలంకరణ కోసం పెడితే అపశకునమా?ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

జ్యోతిష్యం, వాస్తు నమ్మకాలలో ఇంటి అలంకరణకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి వాటిలో నెమలి ఈకలు శుభానికి సూచికగా…

59 minutes ago