Featured

Allu Arjun : చిరంజీవి పుట్టినరోజు సెలెబ్రేషన్స్ కి బన్నీ కావాలనే డుమ్మాకొట్టాడా… బన్నీ చెప్తున్న మాటల్లో నిజమెంత..!

Allu Arjun : మెగా కాంపౌండ్ హీరోలు అనగానే చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత అంత పాపులర్ అయిన హీరోలు బన్నీ, చెర్రీ నే. ఇక ఇందులో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మంచి బిజినెస్ మ్యాన్. గత కొన్నేళ్లుగా బన్నీ సినిమాల తీరు వేరుగా ఉంది, మెగా నీడ నుండి పక్కకు వచ్చి సొంత ఫ్యాన్ బేస్ ను చేసుకున్నాడు బన్నీ. మెగా అభిమానులకు బన్నీ ఇష్టముండొచ్చు కానీ మెగా ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా కొంతమంది బన్నీ ఫ్యాన్స్ ఉన్నవారు ఉన్నారు. ఇక బన్నీ మార్కెట్ ఏపీ తెలంగాణ మాత్రమే కాకుండా కేరళ, కర్ణాటక మరీ ముఖ్యంగా చాపకిందా నీరు లాగా నార్త్ లో పాకింది. పుష్ప సినిమా ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండానే నార్త్ లో ఇరగదీసింది. ఈ విజయంతో బన్నీకి నార్త్ లో ఉన్న క్రేజ్ అర్థమైంది.

కావాలనే చిరంజీవి పుట్టినరోజుకి డుమ్మా కొట్టాడా…

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ప్రతిసారి కంటే ఈసారి చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఇండస్ట్రీ పెద్దగా, ఎంతో మందికి స్ఫూర్తిగా ఉన్న చిరంజీవి గారికి పుట్టినరోజు సందర్బంగా గ్రాండ్ గా ప్లాన్ చేసారు మెగా కుటుంబం. ఇక వేడుకల్లో మెగా కుటుంబం పాల్గొనబోతోంది. అయితే బన్నీ ఈ వేడుకలకు వస్తాడా లేదా అన్న సందేహం ఉండేది. ఈ మధ్యనే బన్నీ ఫ్యాన్స్ చెర్రీ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం ట్విట్టర్ వేదికగా బాగా జరిగింది. తీవ్రంగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ బాగా తిట్టుకున్నారు. ఇంత జరిగాక ఇపుడు బన్నీ ఈ వేడుకలకు హాజరైతే జరిగే పరిణామాలు ఏంటనే అనుమానం ఉంది. ఇక సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు వారి మధ్య విభేదలు ఉన్నాయో లేవో తెలియదు కానీ బయటికి అలాంటి ప్రచారం జరుగుతున్నపుడు బన్నీ ఈ వేడుకలకు వచ్చి ఉంటే క్లారిటీ వచ్చుండేది.

బన్నీ ఇండియా స్వాత్రంత్ర దినోత్సవం తాలుకు అమృత్ మహోత్సవ్ లో పాల్గొనడం కోసం న్యూ యార్క్ వెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ చిరు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాల్సి వస్తుందని వెళ్లుంటే మాత్రం అది తప్పు. చిరంజీవి లేకపోతే బన్నీ లేడు కదా, అది మర్చిపోయి ఉంటాడని అనుకోవడం లేదు అంటూ వివరించారు. ఇక ఏదైనా వీడియో సందేశం అలా విడుదల చేసినా ఫ్యాన్స్ మధ్య ఈ గొడవలు కొంచం తగ్గుతాయి అంటూ చెప్పారు ఇమంది రామారావు. ఒక కుటుంబం లో మనస్పర్తలు మంచివి కాదు అది కూడా సినిమా ఇండస్ట్రీ లో పెద్ద కుటుంబం మధ్య ఇలాంటివి మంచిది కాదు అంటూ వాఖ్యణించారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

9 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago