Allu Arjun: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విషయంలో భారీగా ట్రోల్ అవుతున్నారు. ఇటీవల ఈయన బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ అవార్డు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేషనల్ అవార్డు మన తెలుగు వారికి ఎవరికీ వచ్చిందని చూస్తే ఒకరికి కూడా రాలేదు అప్పుడే నేను నేషనల్ అవార్డును రౌండ్ ఆఫ్ చేసి ఎలాగైనా దాని కొట్టాలని ఫిక్స్ అయ్యానని తెలిపారు.
ఇలా నేషనల్ అవార్డును టార్గెట్ చేసి తాను అవార్డు దక్కించుకున్నానని బన్నీ కామెంట్ చేశారు. ఇంతవరకు బానే ఉంది కానీ గతంలో ఈయన తనకు నేషనల్ అవార్డు వచ్చిన సమయంలో చేస్తున్న కామెంట్లకు సంబంధించి ఒక వీడియోని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. ఇలా నేషనల్ అవార్డు తనకు వచ్చిందనే విషయం తెలియగానే ఈ అవార్డు అందుకుంటున్న తెలుగువారిలో నేను మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి అయ్యి ఉంటాను అనుకున్నాను కానీ నేనే మొదటి వ్యక్తని అప్పటివరకు నాకు తెలియదని ఆ విషయం తెలిసి చాలా సంతోషపడ్డానని బన్నీ తెలిపారు.
నేషనల్ అవార్డు..
ఇలా నేషనల్ అవార్డు గురించి ఈయన ఒక్కో సందర్భంలో ఒక్కో మాట మాట్లాడటంతో ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఇలా మాట మారుస్తూ మాట్లాడినందుకుగాను ఈయనపై భారీ స్థాయిలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పుష్ప సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…