Movie News

Allu Arjun: మైల్ స్టోన్ మూమెంట్.. వైరల్ అవుతున్న అల్లు అర్జున్ మైనపు విగ్రహం?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. పుష్ప సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో ఈయనకు ఉత్తమ జాతీయ నటుడు అనే అవార్డు కూడా వచ్చింది.

ఇలా ఉత్తమ జాతీయ నటుడు అవార్డును అందుకున్నటువంటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక ఈయన హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా దుబాయ్ లో ఉన్నటువంటి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏకంగా ఈయన మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో 28వ తేదీ మార్చి రాత్రి 8 గంటలకు ఈ విగ్రహాన్ని అల్లు అర్జున్ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి అల్లు అర్జున్ మైల్ స్టోన్ మూమెంట్ అంటూ ఈ ఫోటోలను షేర్ చేయగా ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

పుష్ప రాజ్ గెటప్..
ఇలా దుబాయ్ లో మైనపు విగ్రహం ఏర్పాటు చేయటంతో ఎంతోమంది అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ విగ్రహం కూడా పుష్పరాజ్ గెటప్ లో ఉండటం విశేషం. ఇకపోతే దుబాయ్ మ్యూజియంలో ఈ విధంగా మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి సౌత్ ఇండియన్ నటుడిగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలను పొందారు. ఇప్పటివరకు ఈ మ్యూజియంలో ఏ సౌత్ సెలబ్రిటీ విగ్రహం లేకపోవడం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

22 hours ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

22 hours ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

22 hours ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

23 hours ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

23 hours ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

23 hours ago