Amala: సినీనటి అమల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే నటుడు నాగార్జున ఈమెను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న అమల ఇటీవల చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా కుటుంబ వ్యవహారాలన్నింటినీ కూడా చూసుకుంటూ అమల ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. తెరపై తాను ఎన్ని పాత్రలు పోషించిన వ్యక్తిగత జీవితంలో తాను పోషించిన పాత్రల విషయంలో చాలా సంతృప్తి కలిగించిందని తెలిపారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా కాబోయే కోడలకు మీరు ఎలాంటి సలహాలైనా ఇస్తారా అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు అమల సమాధానం చెబుతూ కాబోయే కోడలికి ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆమె చాలా టాలెంట్, మెచ్యూర్డ్ మహిళ. తనకు ఎలాంటి సలహాలు అవసరం లేదు. కచ్చితంగా ఆమె ఒక మంచి భార్య అవుతుంది. ఇలా ఒక మంచి భార్యగా తన జీవితం ఎంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు అలాగే మీ పాఠకులందరూ కూడా ఈ కొత్త జంటను ఆశీర్వదించాలి అంటూ అమల ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఇప్పటికే అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి మొదలైన విషయం మనకు తెలిసిందే ఇప్పటికే హల్దీ వేడుకలు కూడా పూర్తి అయ్యాయి. డిసెంబర్ 4వ తేదీ నాగచైతన్య, శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతున్న సంగతి తెలిసినదే. ఇక తన రెండో కుమారుడు అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగిన సంగతి తెలిసిందే.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…