Featured

Amma Rajashekar : ‘హీరో నితిన్ కు డాన్స్ రాదు.. వాడికి డాన్స్ నేర్పించింది నేనే… కానీ నన్నే మరచిపోయాడు..’ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ అమ్మ రాజశేఖర్

Amma Rajashekar : తెలంగాణా ప్రాంతం నుండి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన అతి కొద్ధి మంది నటులలో నితిన్ కూడా ఒకరు. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా ద్వారా తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం అయ్యారు. దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాలతో హీరోగా మంచిపేరు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా డాన్స్ మాస్టర్, దర్శకుడు అయిన అమ్మ రాజశేఖర్, నితిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హీరో నితిన్ కి అసలు డాన్స్ రాదు.. నేనే నేర్పించా…

కొరియొగ్రాఫర్ గా ముందు తన సినీ ప్రస్తానాన్ని ప్రారంభించిన అమ్మ రాజశేఖర్, తరువాత దర్శకుడిగా సినిమాలు తీయడం ప్రారంవించాడు. కొరియోగ్రాఫర్ గా దేవీ సినిమాతో మొదలు పెట్టి అంజి, సై, కింగ్, లక్ష్మి, సుభాష్ చంద్రబోస్ వంటి సినిమాలకు పనిచేసాడు. 2006 లో ఖతర్నాక్ సినిమాతో దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా రణం సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. తాజాగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన HiFive సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో హీరో నితిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు అమ్మ రాజశేఖర్.

ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ పై అమ్మ రాజశేఖర్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. అసలు హీరో నితిన్ కి డాన్స్ రాదు. నేనే నేర్పించి ఒక పొజిషన్ ఇచ్చాను. తనకు డాన్స్ నేర్పినందుకు గురువు లాంటి వాడిని నేను, కానీ ఈవేళ నన్నే మరచిపోయాడు. మా సినిమా ప్రే రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తాను అని చెప్పి రాలేదు. అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Bhargavi

Recent Posts

వాస్తు ప్రకారం పూజా గది తప్పు దిశలో ఉంటే ఏం జరుగుతుంది?

ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…

6 minutes ago

ధ్యానంలో గజ్జెల చప్పుళ్లు… భక్తులకు దివ్య అనుభవమా లేక భావనా?

ధ్యానం, భక్తి, ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడితే కొన్ని విశేష సంఘటనలు తరచూ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా గజ్జెల చప్పుళ్లు వినిపించడం…

12 minutes ago

AC గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ బీపీపై ప్రభావం తెలుసుకోండి!

వేసవి కాలంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఏసీపై ఆధారపడుతున్నారు. ఇంట్లోనూ, కార్యాలయాల్లోనూ గంటల తరబడి ఏసీలో…

22 minutes ago

పుచ్చకాయ కోసినప్పుడు నురుగు వస్తే? వెంటనే పారేయండి!

వేసవి కాలంలో దాహం తీర్చే పండ్లలో పుచ్చకాయకు ప్రత్యేక స్థానం ఉంది. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది…

29 minutes ago

బ్రౌన్ షుగర్ నిజంగా హెల్తీనా? తెల్ల చక్కెరతో పోలిస్తే అసలు తేడా ఇదే!

ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మనం తినే ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించే అలవాటు పెరిగింది. ముఖ్యంగా చక్కెర…

35 minutes ago

రుచికోసం రిస్క్ తీసుకుంటున్నారా? చికెన్‌లో తప్పక దూరంగా ఉండాల్సిన భాగాలు!

చికెన్ అనేది భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది. తక్కువ ఖర్చుతో మంచి ప్రోటీన్ లభించడంతో చాలామంది వారానికి పలుమార్లు…

40 minutes ago