మీకు నిద్ర అంటె ఎక్కువగా ఇష్టమా.. నిద్ర పోతే చాలా గంటల తర్వాత లేస్తారా.. అయితే వారి కోసమే నెలకు రూ.25 లక్షల జీతం ఇస్తోంది ఓ కంపెనీ. ఆ కంపెనీలో ఉద్యోగం ఇచ్చి..హాయిగా నిద్ర పోయేందుకు ఆఫర్ చేస్తోంది. అసలేంటి ఇది తెలుసుకుందాం..
యూకే బేస్డ్ క్రాఫ్‌టెడ్ బెడ్స్ అనే లగ్జరీ బెడ్ కంపెనీ ఈ ఆఫర్ చేస్తోంది. ఎవరైనా ఆఫీస్ లో నిద్రపోతే బాస్ రూంకి పిలిచి మరీ తిట్ల పురాణం అందుకుంటాడు.. కొన్ని కంపెనీలు అయితే రిజైన్ చేసేయమని చెప్పేస్తాయి కూడా. కానీ ఇక్కడ అలా కాదు.. మీకు ఆ కంపెనీలో ఓ బెడ్ ను కేటాయిస్తారు.
మీరు ఆ బెడ్ మీదనే దాదాపు 6 నుంచి 7 గంటల వరకు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందట. వారంలో దాదాపు 37 గంటల పాటు బెడ్ పై సమయం గడపాల్సి ఉంటుంది. పడుకోవడం, కూర్చొవడం మరేదైనా చేసుకోవచ్చు. దీనిపై సమయం గడిపిన తర్వాత ఆ పరుపు ఎలా ఉంది.. దాని వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా.. వంటి కోణాల్లో సమీక్షించాల్సి ఉంటుంది.
ఇలా చేస్తే నెలకి అక్షరాల రూ.24.80లక్షల ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఉద్యోగానికి అర్హత ఉండాలంటే.. బ్రిటీష్ పౌరసత్వం తప్పనిసరిగా ఉండాలని అంటోంది ఆ యాజమాన్యం. ఇది సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఆఫర్ ఇండియాలో కూడా ఉంటే బాగుండేది అంటూ చెప్పారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…