Analist Telakapalli Ravi : ఇటీవల హిందూ దేవుళ్ళ మీద అనుచిత వాఖ్యలు చేస్తూ హిందూ ప్రజల మనోభావాలను కించపరిచే సంఘటనలు తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాము గుర్తింపు తెచ్చుకోడానికో లేదా రాజకీయ లబ్ది కోసమో తెలియదు కానీ పర్సనల్ అజెండాతో కావాలనే హిందూ దేవుళ్ళ గురించి అనుచిత వాఖ్యలను మొదలు పెట్టారు. ఇటీవల భైరి నరేష్ అయ్యప్ప స్వామి పుట్టుక గురించి చేసిన అనుచిత వాఖ్యలను మరువకముందే మరో సారి సరస్వతి దేవి గురించి మరో వ్యక్తి అనుచిత వాఖ్యలు చేసాడు.
కామరూపిణి అంటే అర్థం అదికాదు…
నాస్తిక వాదంకి చెందిన భైరి నరేష్ చెసిన వాఖ్యలకు మద్దతు తెలిపిన రాజేష్ అప్పుడు నిరసన ఎదుర్కొన్నాడు. అయితే వెంటనే మళ్ళీ క్షమాపణలు చెప్పాడు. కాగా నేడు బాసర సరస్వతి అమ్మాయివారి గురించి వ్యంగ్యంగా మాట్లాడటం అక్కడి ప్రజల అగ్రహానికి కారణం అయింది. ఇక ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి మాట్లాడుతూ దేవుడిని నమ్మే వారు ఉంటారు, నమ్మని వారు ఉంటారు. ఎవరి ఆలోచన అభిప్రాయం వారికి ఉంటుంది వాటిని గౌరవించాలి.
సందేహలను నివృతి చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. అనుమానలను అడగాలి కానీ అవహేళన చేయకూడదు. రాజకీయ దురుద్దేశంతో లేక వ్యక్తిగత ప్రయోజనాలకోసం ఇతరుల మనోభావాలను కించపరచకూడదు అంటూ అభిప్రాయపడ్డారు. ఇటీవల అయ్యప్ప స్వామి గురించి ఇలానే కించపరుస్తూ మాట్లాడారు, నేడు ఇలాంటివి ఏ మతంకు జరిగినా అది తప్పే. సరస్వతి దేవిని విద్యకు దేవతగా పూజిస్తారు. ఆమె ప్రార్థనలో కామరూపిణి నమస్థుభ్యం అని ఉంటుంది కామ రూపిణి అంటే విపరితార్థాలు తీసాడు. కామరూపిణి అంటే అర్థం అదికాదు. తెలుగులో శాంతి కమూకుడు, అన్న పదాలలో వాడుతాము అంటే శాంతి కోరుకునేవాడు అని అర్థం. అర్థం తెలుసుకోవాలి లేదా చర్చించాలి, సందేహం ఉంటే ఇలా అనుచిత వాఖ్యలు చేయడం హీరోయిజం కాదు దేశంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపడం హీరోయిజం అంటూ రవి అభిప్రాయపడ్డారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…