Analyst Damu Balaji : అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ లక్ష్మణ్… ఆ మీడియా సంస్థలకు చురకలు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో పూటకో వార్త బయటికి వస్తున్నా అసలు నిందితులు బయటికి రావడం లేదు. అయితే సిబిఐ కావాలనే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తోందంటూ ఒకవైపు వినిపిస్తున్నా విచారణకు అవినాష్ రెడ్డి హాజరవ్వాల్సిన సమయంలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి తరలించడం, ఆ కారణంతో సిబిఐ విచారణకు గడువు కోరడంతో అవినాష్ రెడ్డి విచారణ తప్పించుకోడానికి కావాలనే ఇలా చేస్తున్నడంటూ విపక్షాలు విమర్శిస్తుంటే మరోవైపు వైఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి సీరియస్ గా ఉందని వైఎస్ కుటుంబ నుండి విజయమ్మ, వివేకానంద రెడ్డి చెల్లి విమలా రెడ్డి పరామర్శించారు. ఇక అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన హై కోర్ట్ తీర్పును తాజాగా బుధవారం నాడు వెల్లడించింది. అయితే అంతకు నాలుగు రోజుల ముందు వాదనలు విన్న హై కోర్ట్ జడ్జి కొన్ని కామెంట్స్ చేసారు. వాటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నా మీద ఒత్తిడి తెస్తున్నారు…

జస్టిస్ లక్ష్మణ్ గారు అవినాష్ కు బెయిల్ మంజూరు చేసే ముందు సిబిఐ వాదనలు, అలాగే సునీత తరుపు లాయర్ అలాగే అవినాష్ తరుపు లాయర్ వాదనలను విన్నారు. ఇక సిబిఐ తరుపు లాయర్ కి దాదాపు 16 ప్రశ్నలను వేయగా వాటికి సిబిఐ నుండి సరైన సమాధానం రాలేదని బాలాజీ తెలిపారు. ఆ తరువాతే ఆయన అవినాష్ కు బెయిల్ మంజూరు చేసారు. అయితే బెయిల్ కు కొన్ని షరతులు విధించారు.

కేసుకు సంబంధించిన ఎవరైనా నిందితులను ప్రభావితం చేసినా లేక సిబిఐ విచారణకు ప్రతి శనివారం హాజరు కాకపోయినా బెయిల్ రద్దుకు సిబిఐ కోర్ట్ ను ఆశ్రయించవచ్చని తెలిపారు. ఇక జస్టిస్ మీడియా గురించి మాట్లాడుతూ ఏబిఎన్ అలాగే మహా అనే మీడియా సంస్థలు నిర్వహించిన డిబేట్స్ కారణంగా తాను ఒత్తిడి గురయ్యానని నేను అమ్ముడుబోయానంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయంటూ పేర్కొన్నారు. వాటి ఫుటేజ్ ను కోర్ట్ కి ఇచ్చి పరిశీలించాలని అదేశించారంటూ బాలాజీ తెలిపారు.