Featured

Analyst Damu Balaji : ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం దేనికి పనికిరానిది… నిజాలు బయట పెట్టిన లక్ష్మి పార్వతి…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతున్న ఎన్టీఆర్ గారి కుమార్తె పురందేశ్వరి చొరవతో ఆర్బిఐ 100 రూపాయల నాణెం ను విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది మూర్ము గారు నాణెంను విడుదల చేయగా ఈ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అయితే భార్యగా తాను పాల్గొనవలసిన హక్కు తనకు ఉందంటూ లక్ష్మి పార్వతి ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాయగా అసలు నాణెం ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదని అది ఒక ప్రైవేట్ కార్యక్రమం అనే విషయాలు బయటికి వస్తున్నాయి. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాముబాలాజీ మాట్లాడారు.

ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం చెల్లని రూపాయి…

లక్ష్మీపార్వతి నాణెం విడుదల వేడుకలకు తనని పిలవలేదని ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు మీద విరుచుకు పడింది. చంద్రబాబు తనకి కావాల్సినపుడు నందమూరి కుటుంబాన్ని ఒకటి చేస్తాడంటూ విమర్శలను గుప్పించింది. అయితే నిజానికి వందరుపాయల నాణేం ను కేంద్ర ప్రభుత్వం ముద్రించలేదు. పురందేశ్వరి ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల సందర్బంగా కేంద్రం తో అనుమతి తీసుకుని ముద్రించారు.

నిజానికి ఆ నాణేం బయట చలామణి కాదు. కేవలం ఎన్టీఆర్ మీద అభిమానం తో ఎవరైనా డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు. ఇక కాయిన్ విడుదల కార్యక్రమం కూడ ప్రైవేట్ గా జరిగినదే. రాష్ట్రపతి భవన్ లో కేంద్ర మంత్రి జెపి నడ్డా పలువురు పాల్గొనడం వల్ల అందరూ ప్రభుత్వ కార్యక్రమం అనుకున్నారు కానీ అది ప్రైవేట్ గా నందమూరి కుటుంబ సభ్యులు నిర్వహించిన కార్యక్రమం అందుకే ఆ వేడుకలకు లక్ష్మి పార్వతిని పిలవలేదు అంటూ బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

ప్రేమించి పెళ్లి… చివరకు భర్త హత్య! హోలోగ్రామ్‌తో బయటపడిన షాకింగ్ కుట్ర

ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…

6 hours ago

అషు రెడ్డి-టెక్కీ వివాదంలో ఆడియో బాంబ్

బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…

6 hours ago

ఒక్క ఛాన్స్ కోసం తిరిగిన సత్యరాజ్.. కట్టప్పగా వరల్డ్ ఫేమ్

దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…

7 hours ago

“ఆ హీరో నా జీవితంలో గాడ్ ఫాదర్”.. అనుష్క ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…

7 hours ago

“వినాశకాలే విపరీత బుద్ధి”.. యువతకు కఠిన హెచ్చరిక

ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…

7 hours ago

మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. మంచు లక్ష్మి రాజకీయ వ్యాఖ్యలు వైరల్

టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…

9 hours ago