Analyst Damu Balaji : ఇస్రో తాజాగా ప్రపంచంలోని ఏ దేశము ఇప్పటివరకు చేదించలేని చంద్రుడిలో దక్షిణ ధ్రువం మీదకు అడుగుపెట్టి సంచలనం సృష్టించగా ఇపుడు మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సూర్యుడి గురించి తెలుసుకోవడం కోసం ఇస్రో తాజాగా ఆదిత్య ఎల్ 1 ప్రయోగం ను సెప్టెంబర్ తొలి వారంలో చేయబోతోంది. అన్ని గ్రహాల మీదకి వెళ్లడం వేరు సూర్యుడి మీదకు వెళ్లడం వేరు సూర్యుని వద్దకు వెళితే కాలిపోతాం కదా అనే అనుమానాల మధ్య అసలు ఆదిత్య ఎల్ 1 ప్రయోగం ఎందుకు ఎలా చేస్తారు అసలు ఎల్ 1 అంటే ఏమిటి వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.
సూర్యుడి గురించి తెలుసుకోవడానికి ఆదిత్య ఎల్ 1….
బాలాజీ గారు ఇస్రో ప్రయోగిస్తున్న ఆదిత్య ఎల్ 1 గురించి చెబుతూ సూర్యుడి గురించి అలాగే సౌర తుఫానుల గురించి ముఖ్యంగా తెలుసుకోవడం కోసమే ఇస్రో ఈ ప్రయోగం చేస్తోందని వివరించారు. సూర్యుడి పై ప్రయోగాలను ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా, యూరప్ దేశాలు చేసిన ఇపుడు వాటి సరసన ఇండియా కూడా నిలవనుంది. సూర్యుడు ఒక నక్షత్రం సూర్యుడి వయసు 450 కోట్ల సంవత్సరాలు అనే విషయం మనకు తెలిసిందే. భూమి కంటే 3 లక్షల 30 వేల రేట్లు పెద్దగా ఉండే సూర్యుడి లో 13 లక్షల భూమి వంటి గ్రహాలను ఉంచవచ్చు. భూమికి సూర్యుడికి మధ్య 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. విశ్వం లో ఉన్న అనేక నక్షత్రాలను గమనించినట్లే సూర్యుడి పై కూడా ప్రయోగాలను చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అలా తాజాగా ఇస్రో సూర్యుడు మీదకి ఒక ఆబ్సర్వేటరీ ను పంపడానికి సిద్ధం అయింది. అయితే సూర్యుడు మీదకు పక్కన పెడితే సూర్యుడికి దగ్గర వెళితేనే కాలిపోతారు సూర్యుడు లో కోర్ భాగంలో కోటి 50 లక్షల డిగ్రీల ఉష్నోగ్రత ఉంటుంది. ఇక ఉపరితలం క్రోమోస్పీయర్ వద్ద 5500 డిగ్రీల ఉష్ణో గ్రత ఉంటుంది. అలాంటపుడు ప్రయోగమెలా సాధ్యం అనే సందేహం అందరిలోనూ వస్తుంది. నిజానికి సూర్యుడి మీద ప్రయోగం చేయడానికి సూర్యుడి మీదకు వెళ్లే వీలు లేదు. అందుకే లెంగ్రాంజ్ పాయింట్స్ వద్ద నుండి ప్రయోగం చేస్తారు.
లెగ్రాంజ్ పాయింట్స్ అనగా లూయి లెంగ్రాంజ్ అనే ఫ్రెంచ్ శాస్త్రవెత్త పేరు మీద ఈ పాయింట్స్ కు ఆ పేరు పెట్టారు. ఒక్కో గ్రహానికి, గ్రహ శాఖలానికి ఒక్కో ద్రవ్యరాశి ఉంటుంది. వాటి ఆధారంగానే వాటి గ్రావిటేషనల్ పవర్ ఉంటుంది. అలా ఒక గ్రహ గ్రావిటేషనల్ పాయింట్స్ ను విభజిస్తారు. ఒక్కో గ్రహానికి మధ్య గ్రావిటేషనల్ పాయింట్ వస్తుందో వాటిని లెంగ్రాంజ్ పాయింట్స్ గా తీసుకుంటారు. అలా గ్రహాల మధ్య సూన్యంగా ఉన్న పాయింట్ ను కనుగొని ప్రయోగాలకు ఉపయోగిస్తారు. అలా ఇపుడు సూర్యుడికి భూమికి మధ్య ఉన్న లెంగ్రాంజ్ పాయింట్స్ లో ఎల్ 1 నుండి అయితే అనుకూలంగా ఉంటుందని భావించి ఇస్రో అక్కడికి ఆదిత్య ఆబ్సర్వ్రెటరీ ని పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ ప్రయోగం ద్వారా సౌర తుఫానులను ముందుగానే అంచనా వేయడం వంటివి చేస్తారు. అయితే భూమి మీద ఉన్న వాతావరణం అలాగే భూ ఆయస్కాంతతత్త్వం వల్ల సౌర తుఫానులు భూమి మీదకు పడే అవకాశం తక్కువ అయితే అంతరిక్షంలో ఉన్న ఖాగోల వస్తువులు, వివిధ షాటిలైట్స్ కి అలాగే అంతరీక్షంలో స్టేషన్స్ ను ఏర్పాటు చేయాలన్న సౌర తుఫానుల వల్ల ప్రమాదం ఏర్పడుతుంది . అందుకే వాటిని ఆదిగమించడానికి ఆదిత్య ఎల్ 1 సౌర తుఫానులను ఖచ్చితత్త్వంతో ముందుగానే పసిగట్టి అలెర్ట్ చేస్తుంది. ఇక సూర్యుడి వల్ల ఇంకా మనం ఎలాంటి లాభాలను పొందవచ్చు వంటి విషయాలను కూడా ఆబ్సర్వెటరీ తెలుసుకోబోతుంది అంటూ బాలాజీ తెలిపారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…
తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…