Featured

Analyst Damu Balaji : ఏపీ లో సర్వేల లొల్లి… నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిచే పార్టీ ఏది…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో పొత్తులు మీదే చర్చలు జోరుగా జరుగుతుంటే ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేల ప్రతి పార్టీ తమ బలాబలాలను తెలుసుకోడానికి సర్వేలను చేస్తుంటారు. అయితే ఈ సర్వేలో వచ్చే ఫలితం కూడా ఒక్కోసారి రాజకీయంగా వాడుకోడానికి చూస్తుంటారు మన నాయకులు. తాజాగా వచ్చే ఎన్నికలలో ఈ పార్టీకి మైలేజ్ ఉంది అంటూ కొన్ని సంస్థలు సర్వేలను ఇస్తున్నాయి. వాటిలో టైమ్స్ నౌ సర్వేలో జగన్ కి తిరుగులేదని క్లీన్ స్వీపర్ దిశగా అడుగులు పడబోతున్నాయని చెప్పగా రీసెంట్ గా మరో సంస్థ ఇండియన్ టీవీ, సిఎన్ఎన్ సర్వేలో జగన్ కి అధికారానికి డోకా లేకపోయినా సీట్లు తగ్గుతాయని చెబుతోంది.

ఏ సర్వేలను నమ్మాలి…

తన ఇమేజ్ తో 151 సీట్లను ఏపీలో కొల్లగొట్టిన జగన్ ఈ సారి 175 మనవే అనడం కొంత ఓవర్ గా ఉన్నా అది మైండ్ గేమ్ అంటూ అందరూ లైట్ తీసుకుంటున్నారు. అయితే జగన్ ఇమేజ్ ను పక్కనబేడితే నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఇమేజ్ ఏమాత్రం బాగోలేదని జగన్ సొంత సర్వేలో తేలింది. అందుకే గెలిచే గుర్రాలకే టికెట్లను ఇస్తున్నట్లు మిగిలిన వారికి క్లాస్ పీకుతున్నారట సీఎం. ఇక టీడీపీ ఒకవైపు పొత్తులతో వెళ్లాలా లేదా అనే మీమాంసలో ఉన్నా తాజాగా వచ్చిన ఇండియన్ టీవీ సిఎన్ఎన్ సర్వేలో జగన్ కి వోటింగ్ శాతం తగ్గుతోందని 46% వోటింగ్ శాతం ఉన్నట్లు చెప్పగా టీడీపీ కి 38% దాకా ఉన్నట్లు చెప్పింది. ఎంపీ సీట్ల విషయానికి వస్తే 18 దాకా వైవీపీ మిగిలిన 7 టీడీపీ ఖాతాలో ఉండొచ్చని తెలిపింది.

అయితే అంతకుముందు నెల క్రితం ఇచ్చిన టైమ్స్ నౌ సర్వేలో మొత్తం ఎంపీ సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పగా ఆరు శతమానం వోటింగ్ వాళ్ళు చెప్పిన దానికంటే తక్కువ ఇండియన్ టైమ్స్ సర్వే చెబుతోంది. అయితే ఈ రెండు సర్వేలలోనూ జనసేన లేకుండా వైసీపీ, టీడీపీ గురించి ఉండగా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, బీజేపీ ఎటువైపు నిలుస్తుంది వంటివి పరిగణలోకి తీసుకోలేదని, ఎవరికి అనుకూలంగా ఉన్న సర్వేలను వాళ్ళు తీసుకుంటుండగా ప్రతికూల సర్వేను ఆయన పార్టీనే చేయించుకుని జనాలతో మైండ్ గేమ్ ఆడుతోందని పార్టీలు ఆరోపిస్తున్నాయని బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

11 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

11 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

11 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

12 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

12 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

12 hours ago