Analyst Damu Balaji : పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం మీద విమర్శను చేస్తూ తాజాగా ఏపీలో మహిళల అక్రమ రవాణా గురించి మాట్లాడారు. ఏపీలో దాదాపుగా 30వేల మంది మహిళలు మిస్ అయ్యారని అందులో 14 వేల మంది తిరిగి రాగా ఇంకా మిగిలిన వాళ్ళ గురించి ఏ విషయం తెలియదని, ఇది కేంద్ర నిఘా సంస్థ చెప్తున్న లెక్కలు నేను కల్పించి చెబుతున్నవి కాదు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఈ మహిళా అక్రమ రవాణాకు వాలంటీర్లు తీసుకుంటున్న వ్యక్తిగత డేటా ఉపయోగపడుతోందని అనడం వివాదాస్పదమైంది. ఇక ఈ విషయాల మీద టీడీపీ అనుకూల మీడియా అయిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తన కొత్త పలుకులో మాట్లాడారు. ఆ విశేషాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.
వాలంటీర్ల ద్వారా వైసీపీ గేమ్ ఆడుతోందా…
పవన్ చేసిన వాఖ్యలను ఆర్కే సమర్తించలేదు. వాలంటీర్ల వల్లే అక్రమ రవాణా అని చెప్పకపోయినా వాలంటీర్ల వల్ల జగన్ ఒక్కో నియోజకవర్గం నుండి డేటా సేకరిస్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యే తో పనిలేకుండా జగన్ వాలంటీర్ల డేటా ద్వారా ఓట్లను తొలగించడం వంటివి చేస్తున్నారని కామెంట్స్ చేసారు. వాలంటీర్లు ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారని మాట్లాడారు. ఇక ఈ విషయం గురించి బాలాజీ మాట్లాడుతూ వాలంటీర్లు వ్యక్తిగత డేటాను సేకరించి ప్రభుత్వానికి ఇస్తున్నానరని అభియోగం తప్పు, నిరాధారమైంది.
ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చాక డేటా సేకరిస్తారు. పథకాలు ఇవ్వాలంటే డేటా ఇవ్వాల్సిందే. ఇక్కడ వ్యక్తిగత డేటా అంటే కేవలం ఆధార్ కార్డు, పాన్ నెంబర్ ఇంట్లో ఉన్న సభ్యుల సంఖ్య వంటివి తీసుకుంటారు. దాని వల్ల వస్తోన్నా నష్టం ఏమిటి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు అంటూ చెప్పడం కూడా నిరాధారమైనది. ఒకవేళ అలాంటి అనుమానం ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…