Featured

Analyst Damu Balaji : దసరా సినిమాకి 36 సెన్సార్ కట్స్… నాని ని తొక్కేయడానికి ప్లాన్ వేసారా…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓలేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గోదావరిఖని వద్ద సింగరేణి మైన్స్ లో సాగే కథా నేపథ్యంలో సినిమా తీశారు. ఇక ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ఆల్రడీ సినిమాలోని సాంగ్స్ హిట్ అయ్యాయి. 30 తేదీ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా చిత్ర యూనిట్ సినిమాను అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. అందుకే నాని నార్త్ సౌత్ అంటూ ప్రమోషన్స్ కోసం తిరుగుతూ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకోగా అందులో ఏకంగా 36 కట్స్ సెన్సార్ బోర్డు చెప్పడంతో సినిమా యూనిట్ షాక్ అయింది. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

తొక్కేయాలని ప్లాన్ చేస్తున్నారా…

నాని ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా ఒకెత్తు. ఏకంగా అన్ని సౌత్ భాషలలోనూ నార్త్ లోనూ విడుదల చేస్తూ పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమా మీద నాని ఫ్యూచర్ ఆధారపడి ఉంది. అయితే సినిమా విషయంలో సెన్సార్ బోర్డు మాత్రం కఠినంగా వ్యవహరించింది. సినిమాలో ఎకంగా 36 కట్స్ చెప్పింది. పల్లె జీవితాన్ని చూపించే సినిమాలో యాసలో మమేకమై ఉండే కొన్ని బూతు మాటలను కూడా బీప్ సౌండ్ వేయమని కొన్నింటిని కట్ చేయమణి ఆదేశాలివ్వడం గమనార్హం.

ఇక కోడి తల కోసే సీన్ కూడా కట్ చేయాలని చెప్పడం విడ్డూరం అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఎన్నో సినిమాల్లో మనిషి తల నరకడం, ఆ తలను తన్నడం లాంటివే చూపించారు కానీ ఇక్కడ కోడి తల నరకడం అభ్యంతరకరం అయింది అంటూ తెలిపారు. నిజానికి పెద్ద సినిమాల విషయంలో సెన్సార్ ఇలా వ్యవహరించదు కానీ చిన్న సినిమాల విషయంలో మాత్రం బాగా కఠినంగా ఉంటుంది. నాని సినిమాకు ఇలా జరగడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. కొంతమంది కావాలనే నాని సినిమాను టార్గెట్ చేసారు. స్వతహాగా నాని పైకి వచ్చాడు, ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే నాని రేంజ్ మారిపోతుంది అందుకే ఇలా చేస్తుండవచ్చు అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

రక్తహీనతతో బాధపడుతున్నారా?.. ఈ డైట్ ఫాలో అయితే హీమోగ్లోబిన్ పెరుగుతుంది!

నేటి కాలంలో రక్తహీనత సమస్య చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. శరీరంలో హీమోగ్లోబిన్…

6 minutes ago

నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా?.. ఇదే మీ అలసటకు అసలు కారణం!

ఉదయం ఎలా ప్రారంభమవుతుందో, అదే రోజు మొత్తం ఎలా సాగుతుందో నిర్ణయిస్తుందని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు. ముఖ్యంగా నిద్రలేవగానే…

12 minutes ago

111 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా జీవిస్తున్న లూయిస్ కానో.. ఆయన సీక్రెట్ ఇదే!

ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడం చాలామందికి ఒక సవాల్‌గా మారింది. అయితే కొందరు వ్యక్తులు తమ…

18 minutes ago

ప్రోటీన్ పవర్‌తో నిండిన పేసరపప్పు లడ్డూ.. ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్!

ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో, సంప్రదాయ వంటకాలపై ప్రజల్లో ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రోటీన్‌ ఎక్కువగా ఉండే…

25 minutes ago

చిన్న పండు.. పెద్ద ప్రయోజనం.. లివర్‌కు నారింజ ఎంత మేలు చేస్తుంది?

నేటి జీవనశైలిలో మార్పులు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల…

33 minutes ago

బాడీ హీట్ తగ్గాలంటే ఇదే బెస్ట్ రిసిపీ.. కొత్తిమీర పచ్చడి మంత్రం!

వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎండలు పెరిగినప్పుడు శరీరంలో వేడి అధికమై అలసట, దాహం, మూత్ర…

56 minutes ago