Analyst Damu Balaji : మంచు మోహన్ బాబు అనగానే క్రమశిక్షణ, సంస్కారం అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. అయితే తాజాగా ఆయన కొడుకుల మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియా ఇంట రచ్చ చేస్తూ మోహన్ బాబు గారి క్రమశిక్షణ, సంస్కారం ఎక్కడికి పోయాయి అని జనాలు మాట్లాడుకుంటున్నారు. తాజాగా మంచు మనోజ్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక వీడియోను అప్ లోడ్ చేసారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవకి కారణం సారధి అనే వ్యక్తి. మోహన్ బాబుకి బందువు, ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఆయనతో మనస్పర్థల కారణంగా విష్ణు గొడవ పడటం ఆ ఇష్యూని వీడియో తీసి మనోజ్ ఫేస్ బుక్ లో అప్లోడ్ చేయడంతో రచ్చ జరిగింది.
సారధి పనికి రాజీనామా…
వరుసకు విష్ణు మనోజ్ లకు బాబాయ్ అయ్యే సారథి, విష్ణు పనికి సంబంధిచిన వివరాలు ఏవో అడిగినపుడు సరిగా చెప్పలేదనే కోపంతో వాళ్ళ ఇంటికి పోయి మరీ గొడవ పడ్డాడు. ఈ ఇష్యూ తరువాత సారధి పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చాడు. అయితే సారధి కుటుంబం నుండి ఈ గొడవ తరువాత ఒత్తిడి ఎక్కువైందని తెలుస్తోంది అంటూ అనలిస్ట్ దాముబాలాజీ తెలిపారు.
ఇక అక్కడ పనిచేయడం వద్దని ఎక్కడైనా వేరే పనిచేసుకుందాం అని ఇల్లు ఖాళీ చెసి వెళ్ళిపోదామని ఒత్తిడి చేస్తునట్లు వినిపిస్తోందని తెలిపారు. అయితే మనోజ్ సారధికి అండగా ఉన్నాడట. అంతే కాకుండా సారథి కూడా మనోజ్ తో ఉండటం వల్లే ఈ గొడవ జరిగిందని వినిపిస్తోంది అంటూ అభిప్రాయపడ్డారు అనలిస్ట్ దాము బాలాజీ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…