Analyst Damu Balaji : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆమె భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలియగానే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అసలు ఎవరిది తప్పు, నిహారిక పబ్ లో దొరకడం వల్లే ఇదంతా జరిగింది అంటూ ఎవరికి వారు కథనాలను అల్లేసుకుంటున్నారు. మరోవైపు చాలా మంది నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీస్తున్నారు అంటూ అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.
మంచి ఎడ్యుకేషనల్ కుటుంబం నుండి వచ్చిన చైతన్య…
చైతన్య జొన్నలగడ్డ కుటుంబం బాగా చదువుకున్న మంచి పదవుల్లో ఉన్న కుటుంబం అంటూ బాలాజీ తెలిపారు. చైతన్య వాళ్ళ నాన్న ప్రభాకర్ గారు గుంటూరు మాజీ ఐజి గా రిటైర్ అయ్యారంటూ చెప్పారు. ఇక తల్లి విజయ పద్మ వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారి నాన్న గారు మంచి స్నేహితులు అవడం, అలాగే చిరంజీవి గారు చైతన్య వాళ్ళ నాన్న గారు స్నేహితులు అవడం వల్ల మొదటి నుండి మంచి రిలేషన్ ఇరు కుటుంబాల మధ్య ఉందంటూ బాలాజీ తెలిపారు. అలా చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న నిహారిక, చైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. చైతన్య నే మొదట ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోందని, క్యాస్ట్ వేరైనా ఇరు కుటుంబాల మధ్యలో ఉన్న స్నేహం వల్ల పెళ్ళికి పెద్దలు ఒప్పుకున్నారు అంటూ బాలాజీ తెలిపారు.
ఇక చైతన్య కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అంటూ చెప్పారు. ఐఎస్బి నుండి ఎంబిఏ చేసిన చైతన్య ఆ పైన సొంత వ్యాపారం చేయాలని మొదట పాలు కంపెనీలలో పనిచేసారు. ప్రోడక్ట్ మేనేజమెంట్, సేల్స్, మార్కెటింగ్, లీడర్షిప్ ఇలా పలు రంగాలకు చెందిన శాఖలలో పలు కంపెనీలలో పనిచేసారని బాలాజీ తెలిపారు. రెగన్సీ సెరామిక్స్, కేపిఎంజి, జిఎంఆర్ గ్రూప్, బ్లేజ్ ఆటోమేషన్స్ అంటూ పలు కంపెనలలో పనిచేసారు. మధ్యలో హార్రీకెన్స్ అంటూ ఒక కంపెనీ కూడా పెట్టిన చైతన్య, ప్రస్తుతం టెక్ మహీంద్ర లో పనిచేస్తున్నారు అంటూ బాలాజీ తెలిపారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…