Analyst Damu Balaji : ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఏపీ కి సేవాలందిస్తున్న రైటర్, డైరెక్టర్, యాక్టర్ అయిన పోసాని కృష్ణ మురళి తాజాగా మీడియాతో మాట్లాడుతూ నంది అవార్డు గురించి హాట్ కామెంట్స్ చేసారు. కమ్మ నందులు అంటూ ఒక కులానికి ఆపాదిస్తూ ఆ కులం డామినేషన్ ఉంటుంది అన్నట్లుగా మాట్లాడారు. తనకు టెంపర్ సినిమా విషయంలో నంది అవార్డు వచ్చినపుడు అలా ఎలా దారి తప్పి నాకు అవార్డు ఇచ్చారు అనుకున్నపుడు నంది అవార్డు ఇచ్చే మెంబెర్స్ లో ఒకరు మినహాయించి అందరూ కమ్మవాళ్ళే ఉన్నారు. అందుకే నేను ఆ అవార్డు తీసుకోకూడదని అనికున్నాను అంటూ కామెంట్స్ చేయగా ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. జగన్ కావాలనే కుల రాజకీయాలను మళ్ళీ చేస్తునానరు అంటూ పలువురు విశేలషిస్తుండగా ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
కమ్మ వాళ్లకు చంద్రబాబు ప్రాధాన్యం…
అనలిస్ట్ బాలాజీ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ నంది అవార్డుల మీద పోసాని ఇపుడే కాకుండా ఇంతకు ముందు కూడా విమర్శలు చేసారు. అయితే ఆయన విమర్శలు ప్రతిసారి చంద్రబాబు టార్గెట్ గానే ఉంటున్నాయి. ఆయన ప్రకారం చంద్రబాబు కమ్మకులానికి ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పడమే. అయితే చంద్రబాబు విషయం పక్కన పెడితే ఇప్పుడు జగన్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నారు ఆ విషయం గురించి పోసాని మాట్లాడరు. ఇక అగ్ర కులానికి చెందిన ఏ సీఎం అయినా వారి కులాలకు కొంత ప్రాధన్యత ఖచ్చితంగా యిస్తారు అందుకే బలహీన వర్గాల నుండి సీఎం అయితేనే న్యాయం జరిగితుంది అంటూ తెలిపారు. ఇక అవార్డుల విషయం గురించి మాట్లాడుతూ మోహన్ బాబు గారు ప్రతిసారి అంటారు గడ్డి వేస్తే నంది వస్తుంది అని మరి అయన కమ్మ కులంకి చెందిన వాడే అయినా ఆయనకెందుకు నంది అవార్డు రాలేదు.
పోనీ ఆయన చంద్రబాబు వ్యతిరేకి అందుకే రాలేదు అనుకుంటే కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడు ఎందుకు రాలేదు. అధికారంలో ఉన్న ఏ సీఎం అయినా తన అనుకున్న మనుషులకు కొంత పక్షపాతం చూపిస్తాడు. అది జగన్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు పోసాని జగన్ కు అనుకూలంగా ఉన్నాడు కాబట్టే ఆయనకు ఎఫ్డిసి పదవి ఇచ్చారు అలాగే ముందున్న సీఎం లు కూడా ఇలాంటి కులానికి సంబంధించిన వ్యాఖ్యలు చేసారు, అనవసరంగా కుల రాజకీయాలు చేయకపోవడం మంచిది అంటూ తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…