Analyst Damu Balaji : బయటికి వస్తే నరికేస్తా… వివేకానంద రెండో భార్య షమీమ్ కి శివ ప్రకాష్ రెడ్డి బెదిరింపు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతూ డైలీ సీరియల్ ను తలపిస్తూ కొత్త క్యారెక్టర్స్ పుడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త వ్యక్తి పేరు ఈ కేసులో వినిపిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర విచారణ ఆగిపోయింది. అయితే ఇల్లీగల్ అఫైర్స్ వివేకానంద చావుకు కారణమని పలు మార్లు వినిపించినా వివేకానంద రెండో భార్య గురించి కూడా పలు కథనాలు వచ్చినా ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న ఆయన రెండో భార్య మొదటి సారి నోరు విప్పారు. ఆమె సిబిఐ ముంగిట పెట్టిన విషయాలలో ఇంటిస్టింగ్ అంశాలు ఉన్నాయి. వివేకానందతో పరిచయం, పెళ్లి దగ్గరి నుండి తాను హత్యకు గురయ్యే గంట ముందు కూడా మాట్లాడినట్లు షమీమ్ చెబుతోంది. ఇలాంటి ఎన్నో కీలక విషయాలను ఆమె పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉన్నాయి అంటూ అనలిస్ట్ బాలాజీ అభిప్రాయపడ్డారు.

శివ ప్రకాష్ రెడ్డి నరికేస్తా అని బెదిరించాడు…

వివేకానంద రెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఆయన అన్న శివ ప్రకాష్ రెడ్డి వివేకానంద అధికారం మీద ఆస్తి మీద కన్నేసారని షమీమ్ తెలుపడం ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారిందంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. షమీమ్ ను 2010 లో పెళ్లి చేసుకోగా వివేకానంద గారు మతం మారి ఆయన పేరును అక్బర్ గా మార్చుకున్నారు. అయితే ఇవన్నీ నచ్చని సునీత, ఆమె భర్త, బావగారు తనను బెదిరించారంటూ షేక్ షమీమ్ తానిచ్చిన స్టేట్మెంట్ లో చెప్పారని బాలాజీ వివరించారు.

ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి అన్న వివేకానంద రెడ్డి బావమరిది అయిన శివ ప్రకాష్ రెడ్డి అంటే భయం అని తనను బయటికి వస్తే నరికేస్తానని బెదిరించినట్లు షమీమ్ తెలిపారు. బయటికి వస్తే నరికేస్తా అని శివ ప్రకాష్ రెడ్డి తనను తన కుటుంబాన్ని బెదిరించారని షమీమ్ చెప్పడంతో ఇప్పుడు సునీత రెడ్డి కుటుంబం వైపు కూడా హత్య చేసి ఉండవచ్చు అనే అనుమానం మొదలవుతోందని బాలాజీ అభిప్రాయాపడ్డారు. వివేకానంద హత్య తరవాత కూడా షమీమ్ బయటకు రాకపోవడానికి కారణం శివ ప్రకాష్ రెడ్డి బెదిరింపులే కారణమని బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago