Analyst Damu Balaji : తెలంగాణ రాష్ట్రములో కొత్త సర్కార్ కొలువుదీరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ నుండి తొలిసారి ప్రభుత్వం ఏర్పడటం అలాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. డిసెంబర్ 7న ఎల్బి స్టేడియంలో అట్టహాసంగా ముఖ్యమంత్రి అలాగే పలు శాఖలకు చెందిన మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. గతంలో కెసిఆర్ మరియు రేవంత్ మధ్య జరిగిన అనేక సంఘటనల నడుమ ఇపుడు రేవంత్ ఎలాంటి రివేంజ్ ప్లాన్ చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.
కాళేశ్వరంలోని అక్రమాలను ఆరా తీస్తున్న రేవంత్…
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే రేవంత్ మొదట చేసిన పని సెక్రటేరియట్ బయట అడ్డుగా ఉన్న గేట్ ను తొలగించి ట్రాఫిక్ తో ఇబ్బందిపడుతున్న జనాలకు ఊరటనిచ్చారు. ఇక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులతో సుధీర్ఘ చర్చలను జరిపిన సీఎం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. దీంతో మాజీ సీఎం కెసిఆర్ ఉచితాల పేరుతో 40వేల కోట్ల అవినీతి చేసినట్లుగా భావిస్తున్నారు. ఇక కెసిఆర్ మొదటి సారి గెలిచినప్పుడు ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోయినా ఇందులో అవినీతి మాత్రం బాగా జరిగింది.
మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని అపర భగీరథడు అని అనిపించికున్న కెసిఆర్, ఆ ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెప్పుకున్నా ఇప్పటివరకు ముప్పై వేల ఎకరాలకు కూడా సాగు నీరు ద్వారా అందించలేకపోయారు. మొదట ప్రాజెక్ట్ వ్యయం 40 వేల కోట్లు కాగా ప్రస్తుతం లక్షా ఇరవైవేల కోట్లకు చేరడమే అవినీతికి నిదర్శనం అంటూ అటు కొంతమంది సామాజిక వేత్తలు అలాగే ఐఏఎస్ అధికారులు, ప్రతిపక్షాలు గొంతు చించుకున్నాయి. కాగా ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి ద్వారా కెసిఆర్ ను రేవంతబరెడ్డి జైలుకి పంపే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోందని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. ముందు ముందు తెలంగాణ రాజకీయాలు ఎటువంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…