Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతూ డైలీ సీరియల్ ను తలపిస్తూ కొత్త క్యారెక్టర్స్ పుడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త వ్యక్తి పేరు ఈ కేసులో వినిపిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర విచారణ ఆగిపోయింది. అయితే ఇల్లీగల్ అఫైర్స్ వివేకానంద చావుకు కారణమని పలు మార్లు వినిపించినా వివేకానంద రెండో భార్య గురించి కూడా పలు కథనాలు వచ్చినా ఇప్పటి వరకు అజ్ఞాతంలోనే ఉంది. ఇక షమీమ్ గురించి పక్కన పెడితే వైఎస్ వివేకానంద హత్య జరిగాక మొదట తెలిసిన వ్యక్తి ఆయన పిఏ కృష్ణా రెడ్డి. ఆయన ఉదయం 5 గంటల ప్రాంతంలో వివేకానంద ఇంటికి వెళ్లి తలుపు తట్టినా ఎంతకీ తీయకపోవడంతో వాచ్ మెన్ రంగయ్యను ఆడినా సమాధానం రాకపోవడంతో గోడదూకి లోపలికి పోయి డోర్ ఓపెన్ చేస్తే రక్తపు మడుగులో వైఎస్ వివేకానంద ఉన్నారు. అయితే ఆ తరువాతే అసలు కథ మొదలైంది అంటూ అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.
సాక్ష్యాలు మాయం చేసిన కృష్ణా రెడ్డి…
ఏ హత్య కేసులో అయినా ప్రాథమిక ఆధారాలు కీలకంగా ఉంటాయి. టెక్నాలజీ అధికంగా ఉన్న ఈ రోజుల్లో అయితే ఫోన్ చాలు నిందితులను పట్టించాడానికి. అయితే వివేకానంద గారి ఫోన్ అలానే ఆయన రాసిన లెటర్ మాయం చేసారు. అలాగే గొడ్డలితో నరకడంతో ఇల్లంతా పడిన రక్తపు మారకాలను వంట మనిషి ప్రకాష్ తో క్లీన్ చేయించారు కృష్ణా రెడ్డి.
ఇక అవినాష్ రెడ్డి కి హత్య గురించి ఫోన్ చేసింది కృష్ణా రెడ్డి గారే కాగా ఇటు సునీత రెడ్డి ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కి ఫోన్ చేసింది కూడా కృష్ణా రెడ్డి గారే అంటూ అనలిస్ట్ బాలాజీ గారు తెలిపారు. ఇక సునీత ఆమె భర్త కి విషయం చెప్పగానే వాళ్ళు ఫోన్ అలాగే లెటర్ దాచిపెట్టమని చెప్పారు అంటూ బాలాజీ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…