Wedding Card: ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీత అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిపై వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఇకపోతే జూలై 12వ తేదీ వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది.
ఇక వీరి వివాహపు తేదీ దగ్గర పడుతున్న తరుణంలో పెళ్లి వేడుకలు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలలో భాగంగా వారి మొదటి వివాహ పత్రికను నీతా అంబానీ స్వయంగా శ్రీ కాశి విశ్వనాధుని సన్నిధి ఉంచి ప్రత్యేక పూజలు చేయించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే వీరి వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డులో సుమారు మూడు కిలోలు వెండితో చిన్న మందిరం ఏర్పాటు చేయడమే కాకుండా అందులో విష్ణువు, లక్ష్మి వినాయకుడి బంగారు ప్రతిమలను తయారు చేసి పెట్టారని తెలుస్తోంది. ఇక ఈ వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రోచ్ఛారణ వినిపిస్తుంది.
మూడు కిలోల వెండి మందిరం..
ఇలా చాలా స్పెషల్ గా ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయించారని చెప్పాలి. మరి ఇన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ వెడ్డింగ్ కార్డ్ ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఒక్కొక్క వెడ్డింగ్ కార్డ్ సుమారు 6.5 లక్షల రూపాయల విలువ చేస్తుందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే గతంలో కూడా ఈయన తన కుమార్తె ఈశా అంబానీ పెళ్లి వేడుకలలో కూడా ఇలా ఖరీదైన పెళ్లి పత్రికను తయారు చేయించారు ఇక ప్రస్తుతం అనంత్ రాధిక వెడ్డింగ్ కార్డ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…