Movie News

Anasuya: నన్ను ఆంటీ అంటారా..? మిమ్మల్ని జైలుకి పంపిస్తా… నెటిజన్స్ ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించిన అనసూయ.. వైరలవుతున్న ట్వీట్స్!

Anasuya:విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా విడుదలయ్యి మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా మొదటి షో తోనే ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో వెంటనే అనసూయ పరోక్షంగా హీరో విజయ్ దేవరకొండ పై సంచలనమైన ట్వీట్ చేసింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు..కర్మ ఫలితం రావడం ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్క అంటూ చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయింది.

ఈ విధంగా అనసూయ విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసింది అంటూ పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు దారుణంగా అనసూయను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కామెంట్లపై అనసూయ స్పందిస్తూ… ఛీ… ఛీ బోలెడంత చెత్త వస్తోంది ఎంత క్లీన్ చేసిన ఈ చెత్త ఇలాగే వస్తోంది అంటూ కామెంట్ చేశారు.

ఇలా ఈమె సోషల్ మీడియాలో వరుస ట్వీట్ చేయడంతో అభిమానుల సైతం రెచ్చిపోయి అనసూయ ను ఏకంగా ఆంటీ అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నన్ను ఆంటీ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తారా…మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది తప్పకుండా మీపై చర్యలు తీసుకుంటా అంటూ ఈమె కామెంట్ చేశారు.

Anasuya: ఓ మహిళ చేస్తున్న పోరాటం…

ఈ క్రమంలోనే ఆంటీ అంటేనే కేసు ఫైల్ చేస్తే ట్విట్టర్లో ఉన్నటువంటి దాదాపు సగం మంది జైల్లోనే ఉండాల్సి ఉంటుంది అంటూ కామెంట్ చేయడంతో వెంటనే అనసూయ ఈ ట్వీట్ పై స్పందిస్తూ ఇక్కడ చాలా జైలు, సెక్షన్లో ఉన్నాయి అంటూ ఘాటుగా స్పందించారు. ఇలా ఈమె తన గురించి వచ్చినటువంటి ప్రతి ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఘాటుగా స్పందించడమే కాకుండా ఓ మహిళకు జరుగుతున్న అన్యాయంపై చేస్తున్న పోరాటం అని, తన గౌరవం కోసం చేస్తున్న పోరాటమిదని రుజువు చేయడం కోసమే ఇలా రీ ట్వీట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. మీరు నన్ను మాత్రమే కాకుండా ఈ విషయంలోకి నా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని తప్పకుండా ప్రతి ఒక్కరూ బాధపడతారంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago