Anchor Ravi: చివరికి వాటిని కూడా వదలవా.. అషు రెడ్డి పై యాంకర్ రవి పంచ్..!
Anchor Ravi: అషూ రెడ్డి బిగ్ బాస్ తరువాత టీవీ షోస్ తో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యాంకర్ రవి ,ఆషూ రెడ్డి ఇద్దరూ కలిసి హ్యాపీ డేస్ షో చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఎప్పుడూ ఏదో ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళటం వలన కొన్ని రోజులు ఈ షో ఆగిపోయింది.
ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లో చేసే ఫన్ ఎక్కువగా ఉంటుంది. షూటింగ్ లేని ఖాళీ సమయాల్లో ఒకరిమీద ఒకరు వీడియోలు తీసుకొని వాటికి ఫిల్టర్ లో యాడ్ చేసి నెట్టింట్లో హంగామా చేస్తుంటారు. ఇక అషూ రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే.
తనకు సంబంధించిన ఏ విషయమైనా అషూ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఏకంగా శ్రీవల్లి గెటప్ లో ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలపై కూడా యాంకర్ రవి తనదైన శైలిలో పనిచేశాడు.
ఈక్రమంలోనే అషూ రెడ్డి షూటింగ్ లేని సమయంలో సెట్ లో ఉన్న వస్తువులను ఉపయోగిస్తూ వింత ఫోటో షూట్ చేయించుకుంది. ఇలా సెట్ ప్రాపర్టీస్ అయిన పుర్రెల దండ మెడలో వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో యాంకర్ రవి వీటిపై స్పందించి తనకు పంచ్ వేశాడు. చివరికి వాటిని కూడా వదలవా అంటూ కామెంట్ చేయగా వెంటనే అషూ రెడ్డి స్పందిస్తూ అవి కూడా మనమే కదా… అంటూ రివర్స్ పంచ్ వేసింది. మొత్తానికి అషూ రెడ్డి పుర్రెలతో దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…