Categories: FeaturedMovie News

SSMB28: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్..సినిమా స్టార్ట్ కాకుండానే విడుదల తేదీ ప్రకటించిన డైరెక్టర్!

SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 2020 అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రానికి దర్శక పర్యవేక్షకుడిగా పని చేస్తున్నారు.

SSMB28: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్..సినిమా స్టార్ట్ కాకుండానే విడుదల తేదీ ప్రకటించిన డైరెక్టర్!

ఇక మహేష్ బాబుతో ఈ ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశారు.మహేష్ బాబు 27వ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత తొందరగా తన 28వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పట్టాలెక్కుతుంది.

SSMB28: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్..సినిమా స్టార్ట్ కాకుండానే విడుదల తేదీ ప్రకటించిన డైరెక్టర్!

సర్కారీ వారి పాట చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా మహేష్ బాబు కాలికి సర్జరీ కావడంతో ఆలస్యమవుతుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు సర్కారీ వారి పాట పూర్తయిన వెంటనే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మొదలు కానుంది.అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే మహేష్ అభిమానులకు డైరెక్టర్ శుభవార్త తెలిపారు.

ఇది సాధ్యమయ్యే పనేనా..

ఏప్రిల్ నెలలో ఈ సినిమాని స్టార్ట్ చేసి మే 31వ తేదీ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్ విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని ఆరేడు నెలలో పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని డైరెక్టర్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రారంభం అవుతుంది కనుక ఈలోగా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి త్రివిక్రమ్ అనుకున్న ప్లాన్ అమలవుతుందా.. ఇది సాధ్యమయ్యే పనేనా అని పలువురు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. చూడాలి మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన టార్గెట్ రీచ్ అవుతారో లేదో.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago