Suma: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమా కనకాల ఒకరు. ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నటువంటి సుమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంది తనకు సంబంధించిన అనే విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలలో ఎక్కువగా తన స్టాఫ్ తో పాటు ఇంట్లో తన పని వాళ్ళను కూడా చూపిస్తూ పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఉమెన్స్ డే సందర్భంగా సుమా ఒక వీడియోని షేర్ చేసారు ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో హడావిడిగా అన్ని పనులు తానే చూసుకుంటూ మరో వైపు షూటింగులకు వెళ్తూ తిరిగి ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉన్నటువంటి సన్నివేశాలను ఒక వీడియోగా చిత్రీకరించారు. అయితే ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే ముందుగా ప్లాన్ చేసి చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది.
ఉమెన్స్ డే స్పెషల్..
ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. సుమక్క ఆస్కార్ రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇస్తుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా ఒకే డ్రెస్ లోనే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూనే ఉన్నారా సుమక్క అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సుమ ఈ వీడియో ద్వారా భారీగానే ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…