Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో నటి సమంత ఒకరు. ఈమె ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ గత 14 సంవత్సరాలుగా అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్నారు అయితే ఇటీవల సమంత సినిమాలకు దూరమైన సంగతి మనకు తెలిసిందే. సమంతకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యల కారణంగా చిన్న విరామం ఇచ్చారు.
ఈ విధంగా సమంత సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇకపోతే ఈమె ఇప్పుడు సమస్యల నుంచి కోలుకున్నారని తెలుస్తుంది. ఇలా ఈ వ్యాధి నుంచి సమంత కోలుకోవడంతో తిరిగి సినిమాలలోకి రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇకపోతే ఇటీవల సమంత తన అనారోగ్య సమస్యల గురించి పలు విషయాలను వెల్లడించారు. అయితే తాజాగా ఇండస్ట్రీకి విరామం ఇవ్వడం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి ఏడాది పాటు విరామం ఇవ్వాలన్నది చాలా కఠినమైనటువంటి నిర్ణయం అయితే ఈ విషయం గురించి సమంత మాట్లాడుతూ…
ఆరోగ్యమే ముఖ్యం..
నేను ఇండస్ట్రీకి విరామం ఇవ్వాలని అసలు అనుకోలేదు కానీ అలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా కెరియర్ కంటే ఆరోగ్యమే నాకు ముఖ్యం. ఇకపై జీవితంలో ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నా అంటూ సమంత పేర్కొంది. నేను బ్రేక్ తీసుకుంది సమయం వృధా చేయడానికి కాదు. నా ఆరోగ్యం కోసమే. దీని కోసం చాలా అవకాశాలు వదులుకోవాల్సి వస్తుందనే విషయం నాకు తెలుసు కానీ తప్పలేదు అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…