Anchor Varshini: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ గా గుర్తింపు పొందిన వారిలో వర్షిని కూడా ఒకరు. ఢీ షోలో టీం లీడర్ గా వ్యవహరించి తన అమాయకత్వంతో అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న వర్షిని ఆ తర్వాత కొన్ని టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించింది. అంతేకాకుండా అడపా దడపా సినిమాలలో కూడా నటిస్తోంది. ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమాలో కూడా ఒక పాత్రలో నటించింది. అలాగే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోల వల్ల విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తాజాగా వర్షిని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక ఫోటో వల్ల కొంతమంది నెటిజెన్లు విమర్శలు కురిపిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. టాటా ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఈ నెల 18న ముంబై-హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కి యాంకర్ వర్షిణి కూడా హాజరయ్యింది. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్‌తో ఆమె సెల్ఫీ దిగింది.
సూర్య కుమార్ యాదవ్‌తో ఉన్న ఆ ఫోటోను వర్షిణి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అయితే వర్షిని ఏం చేసినా కూడా ముందు వెనక ఆలోచించకుండా పని కట్టుకొని విమర్శలు చేసే మ్యాచ్ ఇప్పుడు కూడా ఆమె పై విమర్శలు చేస్తున్నారు. క్రికెటర్ తో దిగిన ఫోటో గురించి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అభిమాన క్రికెటర్ తో ఫోటో దిగటం వల్ల వారిద్దరి మధ్య రిలేషన్ అంటగడుతూ వర్షిణి గురించి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
‘నిన్ను ఎవ్వరు రానిచ్చారు లోపలికి, ఈ రోజు నైట్‌కి ఇద్దరు కలిసి పార్టీ చేసుకుంటున్నారా అని కొందరు నీచంగా కామెంట్స్ చేస్తుంటే..భాయ్‌కి పెళ్లి అయిపోయిందీ అయినా వదలవా’ అంటూ మరికొందరు వరస్ట్ కామెంట్లతో రెచ్చిపోతు బూతు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ విషయంలో వర్షిణి కి సపోర్ట్ చేస్తూ సెలబ్రిటీ అయినా కూడా వారికి వ్యక్తిగత విషయాలు ఉంటాయి. ఇలా వర్షిణి గురించి నీచమైన కామెంట్లు చేసేవారి మీద ఫైర్ అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…