Anitha Chowdary: అనిత చౌదరి అంటే టక్కున ఈమె గుర్తుకు రాకపోయినా కస్తూరి అంటే మాత్రం అందరికీ ఇట్టే గుర్తుకు వస్తుంది. కస్తూరి సీరియల్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి అనిత చౌదరి ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించిన అనిత చౌదరి అనంతరం సినిమాలు సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అందుకున్నారు.
మంజుల నాయుడు దర్శకత్వంలో తెరికెక్కిన కస్తూరి సీరియల్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సీరియల్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.కస్తూరి సీరియల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యేది అయితే ఈ సీరియల్ ఏడు సంవత్సరాలుగా ప్రసారమైందని ఈ సీరియల్ తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందని అనిత చౌదరి తెలిపారు.
ఇక ఈ సీరియల్ సమయంలో ఎంతోమంది అమ్మాయిలు తన పాత్రను ప్రేమించారని అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా కస్తూరి పాత్రను ఎంతగానో ఇష్టపడ్డారని తెలిపారు.ఆ సమయంలో సోషల్ మీడియా లేకపోవటం వల్ల ఎంతో మంది అభిమానులు తనకు ఉత్తరాలు రాసేవారని ఈ సందర్భంగా అనిత చౌదరి తెలియజేశారు.
కొంతమంది అబ్బాయిలు ఉత్తరాల ద్వారా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ సీరియల్ రావటం వల్ల తమ భార్యలు తమకు భోజనం పెట్టడం కూడా మానేశారని ఫిర్యాదులు చేసేవారు. అంతలా ఈ పాత్ర తనకు గుర్తింపు వచ్చిందని, ప్రేక్షకుల ఆదరాభిమానాలకు మించిన అవార్డులు ఏవి లేవంటూ ఈమె తెలిపారు. ఇక చత్రపతి సినిమాలో సూరీడు.. ఓ సూరీడు.. ఏడున్నావురా? బస్సుకు ఏలవుతోందనే ఒక డైలాగ్ ద్వారా తన పాత్ర ఎంతో హైలైట్ అయిందని ఈ డైలాగ్ ఎంతోమంది ప్రేక్షకుల గుండెను తాకింది అంటూ ఈ సందర్భంగా ఈమె తెలిపారు.
టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…
శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…
ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…
అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…
బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…