Anupam Parameswaran: ప్రేమమ్ అనే సినిమా ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా తర్వాత అనంతరం ఈమె తెలుగులో కూడా పలు సినిమా అవకాశాలను అందుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే టిల్లు స్క్వేర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ చిత్రంగా రాబోతున్నటువంటి ఈ సినిమా మార్చి 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..
ఈ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో వరుసగా సినిమా నుంచి అప్డేట్స్ విడుదల చేస్తూ భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా నుంచి ఓ మై లిల్లీ అనే పాటను విడుదల చేశారు ఈ పాట లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాలో అనుపమ నటించినటువంటి బోల్డ్ సన్నివేశాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమాలో ఈమె కాస్త బౌండరీస్ క్రాస్ చేస్తే మరి రొమాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఈ విషయం గురించి ఈమె మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒక నటిగా నేను ఇన్ని సంవత్సరాలపాటు చేసినటువంటి పాత్రలను మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే నాకు చాలా బోర్ కొడుతుందని తెలిపారు.
బోర్ కొడుతున్నాయి..
మనకు బిర్యానీ అంటే ఇష్టమని ప్రతిరోజు మన ఇంట్లో బిర్యానీ చేసుకొని తినలేము కదా. అలాగే నేను కూడా ప్రతిరోజు బిర్యానీ తినాలని కోరుకోవడం లేదు నాకు పులిహోర కూడా కావాలంటూ ఈమె రొమాంటిక్ సీన్స్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ హాట్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…