Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయాసైటిసిస్ కారణంగా ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఈమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసేవారు.
ఇక ఈ వ్యాధి కోసం ఎన్నో దేశాలకు తిరిగి చికిత్స తీసుకున్నటువంటి సమంత త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు సినిమా కథలను కూడా వినే పనులలో సమంత బిజీగా ఉన్నారని సమాచారం. ఇక ఈమె చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈమె సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఈ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతోంది.
ఇలా ఇండస్ట్రీలోకి త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి సమంత భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ పెంచుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి సమంత కొత్తగా కమిట్ అయ్యే సినిమాలకు కూడా ఆరు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.
రెండు కోట్లు అదనం..
ఈమె ఇది వరకు ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారు అయితే ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోయినా చేయబోయే సినిమాలకు ఏకంగా 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారనే విషయం తెలిసే అందరూ షాక్ అవుతున్నారు. ఈమె ఇండస్ట్రీకి విరామం ఇచ్చి ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచారని నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…