Movie News

Mokshagna: ఆ స్టార్ హీరో కథతో మోక్షజ్ఞను లాంచ్ చేయనున్న బోయపాటి… రిస్క్ చేస్తున్న బాలయ్య?

Mokshagna: ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది సినీ వారసులో హీరోలుగా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నందమూరి బాలయ్య వారసుడు మాత్రం ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. స్టార్ హీరోల వారసులు టీనేజ్ లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు కానీ మోక్షజ్ఞ మూడు పదుల వయసుకు చేరువవుతున్నారు.

ఇలా ఈయన 30 సంవత్సరాల వయసుకు దగ్గర పడుతున్న ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోవడంతో బాలయ్య అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఐదు సంవత్సరాల నుంచి బాలకృష్ణ తన కుమారుడి సినీ ఎంట్రీ ఉంటుంది అంటూ ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలబడలేదు అయితే వచ్చే ఏడాది మాత్రం ఈయన ఎంట్రీ ఉంటుందని గతంలో బాలయ్య చెప్పారు.

ఇకపోతే ప్రస్తుతం మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం తనని తాను పూర్తిగా మలుచుకున్నారని తెలుస్తుంది. ఈ ఎలక్షన్ హడావిడి పూర్తి కాగానే బాలయ్య ఫోకస్ మొత్తం మోక్షజ్ఞ పైనే ఉంటుందని సమాచారం అయితే ఈయనని ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం బోయపాటికి ఇచ్చారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ కథతో..
బోయపాటి శ్రీను ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసి పెట్టారట గతంలో అల్లు అర్జున్ కోసం తయారు చేసుకున్నటువంటి కథతోనే మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విధంగా అల్లు అర్జున్ కథతో మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి పలువురు అభిమానులు ఈ కథతో మోక్షజ్ఞను ఇండస్ట్రీకి లాంచ్ చేస్తూ బాలయ్య రిస్క్ చేస్తున్నారేమో అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago