YS Sharmila: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టారు అయితే ఈ సమావేశాలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడం పట్ల వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాకపోవడం గురించి షర్మిల స్పందిస్తూ అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని షర్మిల తెలిపారు.
అసెంబ్లీ మీద అలగడానికో మైక్ ఇస్తేనే పోతానని చెప్పడానికి కాదు మీకు ఓట్లు వేసింది అసెంబ్లీ అనేది ఒక దేవాలయం వంటిది అక్కడ ప్రజా సమస్యల గురించి అధికార పక్షాన్ని నిలదీయడానికి వేదికని అలాంటి అసెంబ్లీలో అడుగెట్టననడం సరైంది కాదన్నారు వైఎస్ షర్మిల. ఇలా తన అన్నయ్య అసెంబ్లీకి వెళ్లకపోవడం పట్ల ఈమె వరస పోస్టులు పెట్టారు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకు హాజరౌతానని చెప్పడం అవివేకం, అజ్ఞానానికి నిదర్శనమన్నారు. మీ స్వయం కృతాపరాధం వల్లే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఇక ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా సరైన విధంగా అమలు చేయకపోవడం పట్ల ఈమె కూటమే ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు.
సూపర్ సిక్స్ ఎక్కడ..
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలకు, మేనిఫెస్టో హామీలకు దిక్కులేదని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోందని, మహిళలలపై దాడులు కొనసాగుతున్నాయని, ఇసుక మాఫియా చెలరేగుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 5 నెలలు కావస్తున్నా ఇప్పటికి ఒక ఉద్యోగం లేదని రోజు రోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది అంటూ ఈమె రాష్ట్ర సమస్యలపై వరుస పోస్టులు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…