AP: ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది కూటమి ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు మరికొన్ని హామీలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అన్నే విషయం గురించి తాజాగా రవాణా శాఖ మంత్రి స్పందించారు.
ఈ సందర్భంగా రవాణా క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే మరో 15 రోజులలో ఉచిత బస్సు ప్రయాణం పై ఒక కమిటీ వేసి నిర్ణయిస్తామని తెలిపారు..
ప్రస్తుతం తెలంగాణ కర్ణాటకలో అమలవుతున్న ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి ఆయా రాష్ట్రాలలో పర్యటించిన తర్వాత అమలు చేస్తామని తెలిపారు. ఇక ఇటీవల విజయవాడ బస్టాండ్ లో పర్యటించి అక్కడ ప్రయాణికులతో మాట్లాడి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక బస్సు కూడా కొనలేదని బస్సులను కూడా రిపేర్ చేయించలేదని తెలిపారు.
ఒక్క బస్సు కూడా కొనలేదు..
దూర ప్రాంతాలకు నడిచే బస్సుల సంఖ్య పెంచుతామని అలాగే కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను కొంటామంటూ తెలిపారు. బస్ స్టేషన్లలోనే భోజన సదుపాయాలు వాష్ రూమ్లో వంటివి సరిగ్గా ఉండేలా చూస్తామంటూ అలాగే ప్రయాణికుల భద్రత విషయంలో కూడా ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…