హీరోయిన్ తాప్సీ పన్ను.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తురవత తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో ఈ భామ బాలీవుడ్ సినిమాలలో తన ప్రత్యేకత చాటుకుంటోంది. అయితే గత కొన్నాళ్ళగా తాప్సీ డెన్మార్క్‌కు చెందిన మ్యాథ్యూస్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గత ఏడాది ఆమె స్వయంగా వెల్లడించింది.
ఈ నేపధ్యంలో వీరిద్దరూ కలిసి హాలీడే ట్రిప్స్ కూడా వేసారు. ఇక తాజగా త్వరలో తాప్సీ–మాథ్యూస్ పెళ్లి జరగబోతోందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనిపై స్పందించిన తాప్సీ.. ‘‘ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ప్రస్తుతం సంవత్సరానికి ఆరు సినిమాలు చేస్తున్నాను. ఒక వేళ అది రెండు, మూడు సినిమాలకు పడిపోయినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను.’ అంటూ స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తిని అసలు పెళ్లి చేసుకోనని చెప్పిన తాప్సీ మ్యాథ్యూస్ తనకు బాగా తెలిసిన వ్యక్తి అనీ, అతనితో ప్రేమలో ఉన్నాననీ గతంలో తెలిపారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…