ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతేడాది ఇదే సమయంలో చైనాలో విజృంభించిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై ఈ మహమ్మారి ప్రభావం పడింది. కరోనా విజృంభణ వల్ల ఏపీలో నెలల తరబడి బస్సులు డిపోలకే పరిమితం కావాల్సి వచ్చింది.
ఎండీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి 2,528 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. సాధారణంగా బస్సులు నడవాల్సిన దూరంతో పోలిస్తే 78.84 కోట్ల కిలోమీటర్లు తక్కువగా నడిచాయని చెప్పారు. బస్సు సర్వీసులు మొదలైన తరువాత పరిమిత సంఖ్యలో మాత్రమే 50 శాతం సీటింగ్ కెపాసిటీతో బస్సులు నడిచాయి. కరోనా సమయంలో సైతం ఆర్టీసీ సర్వీసులను అందించింది.
కరోనా విజృంభణ వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన 5,586 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా వీరిలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది నవంబర్ నెల నాటికి ఏపీఎస్‌ఆర్టీసీ ఆదాయం 3,350 కోట్లు కాగా ఈ ఏడాది 827 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ జనవరి నెల నుంచి పల్లెలకు సైతం సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా 3,607 ప్రత్యేక బస్సులను ఏపీఎస్‌ఆర్టీసీ నడపనుంది.
అయితే ఈ బస్సులకు సాధారణంగా వసూలు చేసే ఛార్జీలతో పోలిస్తే 50 శాతం అదనంగా వసూలు చేస్తారు. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు 45 వేల కిలోమీటర్ల మేర బస్సు సర్వీసులను పెంచాలని భావిస్తోంది. మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ త్వరలో 5,200 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోనుందని సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…