దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో క్రెడిట్ కార్డుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగాలు చేసేవాళ్లు, వ్యాపారులు, ఉన్నత చదువులు చదివే విద్యార్థులు క్రెడిట్ కార్డులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డును వినియోగించే వాళ్లు సరైన సమయంలో బిల్లు చెల్లిస్తే మంచిది. ఏదైనా కారణాల వల్ల సరైన సమయంలో బిల్లు చెల్లించడం సాధ్యం కాకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
క్రెడిట్ కార్డుల వల్ల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు, ఇన్‌స్టంట్ క్రెడిట్, నో కాస్ట్ ఈఎంఐ, రివార్డ్ పాయింట్లు లాంటి ప్రయోజనాలను పొందవచ్చు. అయితే క్రెడిట్ కార్డ్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. క్రెడిట్ కార్డ్ ను ఏ విధంగా వినియోగించుకున్నా బిల్లు సక్రమంగా చెల్లించేలా చూసుకోవాలి. లేకపోతే క్రెడిట్ స్కోర్ పై ఆ ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటే భవిష్యత్తులో రుణాలను పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
కొన్ని సందర్భాల్లో అన్ని అర్హతలు ఉన్నా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందనే కారణంతో బ్యాంకులు రుణాలను మంజూరు చేయవు. బ్యాంకులు ఆలస్యంగా క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించే వాళ్ల నుంచి ఆలస్య రుసుమును వసూలు చేస్తుండటంతో క్రెడిట్ కార్డ్ బిల్లు లేట్ గా చెల్లిస్తే నగదు భారం పడే అవకాశం ఉంది. ఆలస్యంగా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తే అధిక వడ్డీ భారం కూడా పడుతుంది.
సరిగ్గా బిల్లులు చెల్లించకపోతే సిబిల్ స్కోర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. బిల్లు చెల్లించకపోవడం వల్ల కార్డు బ్లాక్ అయితే క్రెడిట్ స్కోర్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. సరిగ్గా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించని వాళ్లకు రివార్డు పాయింట్లు కూడా తగ్గుతాయి. అందువల్ల క్రెడిట్ కార్డ్ తీసుకుంటే సక్రమంగా బిల్లులు చెల్లిస్తే ఈ సమస్యల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…