Ashwini dutt: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత అశ్విని దత్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.తాజాగా ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన సీతారామం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన బ్యానర్ లో వచ్చిన ఎన్నో సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా గురించి ఈయన ఎన్నో విశేషాలు వెల్లడించారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య నటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత్రలో ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకోవాలని భావించారట. అయితే చివరికి ఎన్టీఆర్ పాత్రను ఈ సినిమాలో పెట్టకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టాలని అనుకున్నాము. అయితే అప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రకటించారు.
ఈ విధంగా బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రకటించడంతో మహానటి సినిమాలో ఆయన పాత్రలో ఎవరిని పెట్టి నటింపచేసిన ప్రజలు, అభిమానులు తప్పుగా భావిస్తారన్న ఉద్దేశంతోనే చివరి నిమిషంలో ఎన్టీఆర్ ను వద్దనుకున్నామని వెల్లడించారు.అయితే ఈ విషయం నాగ్ అశ్విన్ కి తెలియడంతో ఎన్టీఆర్ లేకుండా ఆయన పాత్ర చేస్తా అంటూ తెరవెనక ఎన్టీఆర్ వాయిస్ తో రాజేంద్రప్రసాద్ చేత రెండు డైలాగులు చెప్పించామని ఈ సందర్భంగా అశ్విని మహానటిలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…